- Home
- Business
- Smart Tv Prices Down: అమెజాన్లో రూ.6000 కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఇవిగో
Smart Tv Prices Down: అమెజాన్‌లో రూ.6000 కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఇవిగో
దీపావళి సేల్ ఆఫర్ అమెజాన్ లో సాగుతోంది. ఈ సందర్భంగా ఎల్ఈడి స్మార్ట్ టీవీలు (Smart Tv Prices Down) అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. సామ్ సంగ్, షియోమీ, టిసిఎల్ వంటి బ్రాండ్లకు చెందిన టీవీలు 6000 రూపాయలలోపే ప్రారంభమవుతున్నాయి.

అమెజాన్‌లో తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు
అమెజాన్ ఫెస్టివల్ సేల్ నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దీపావళి పండుగ వరకు ఆ ఫెస్టివల్ ను పొడిగించారు. ఈ సేల్ లో అతి తక్కువ ధరకే టీవీలను అమ్ముతున్నారు. 6000 రూపాయల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. సాంసంగ్, టిసిఎల్, షియోమీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు అందిస్తోంది అమెజాన్.
విజియో వరల్డ్
స్మార్ట్ టీవీ డీల్స్ అమెజాన్ లో ఎన్నో ఉన్నాయి. వాటిలో విజియో వరల్డ్ టీవీ ఒకటి. 32 అంగుళాల ఎల్ఈడి స్మార్ట్ టీవీ.. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్ లు ఇందులో ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. ఈ టీవీ ధర కేవలం 5,999 రూపాయలు మాత్రమే.
ఫిలిప్స్ టీవీ
ఫిలిప్స్ కంపెనీకి చెందిన 32 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర 22,999 రూపాయలుగా ఉంది. దీనిలో 50 శాతం తగ్గింపు ధరతో 11,149 రూపాయలకే దీన్ని అందిస్తున్నారు.
షియోమీ టీవీ
ఈ స్మార్ట్ టీవీని 52 శాతం తగ్గింపు ధరతో అందిస్తున్నారు. 24,999 రూపాయలు ఖరీదైన టీవీని 11,999 రూపాయల ధరకు అందిస్తున్నారు. ఇది హెచ్‌డి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇక టిసిఎల్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ ధర 22,999 రూపాయలుగా ఉంది. దీనిపై 39 శాతం తగ్గింపు ధరను అందిస్తున్నారు. అంటే 13,990 రూపాయలకి ఈ టీవీ అందుబాటులో ఉంది.
సామ్ సంగ్ టీవీ
దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ టీవీ 17,900 రూపాయల ధరతో ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్లో ఇప్పుడు 13,900 రూపాయలకే అందిస్తున్నారు. అంటే 22 శాతం ధర తగ్గింది. ఈ ఆఫర్లు త్వరలోనే ముగిసిపోతాయి. కాబట్టి ఈలోపే మీరు స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయడం ఉత్తమం.