MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Jio : జియో బంపర్ ఆఫర్..స్టార్టర్ ప్యాక్‌ తో అన్ని అన్‌ లిమిటెడ్‌.. ఫ్రీగా ఫైబర్ సేవలు కూడా

Jio : జియో బంపర్ ఆఫర్..స్టార్టర్ ప్యాక్‌ తో అన్ని అన్‌ లిమిటెడ్‌.. ఫ్రీగా ఫైబర్ సేవలు కూడా

Jio Starter Pack: జియో స్టార్టర్ ప్యాక్‌ ద్వారా కొత్త ఫోన్ వినియోగదారులకు అన్ లిమిటెట్ 5G డేటా, ఫైబర్ ట్రయల్, AI క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి. జియో స్టార్టర్ ప్యాక్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Mahesh Rajamoni
Published : Jun 17 2025, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో స్టార్టర్ ప్యాక్‌తో కొత్త డిజిటల్ శకం ప్రారంభం
Image Credit : Getty

జియో స్టార్టర్ ప్యాక్‌తో కొత్త డిజిటల్ శకం ప్రారంభం

Jio Starter Pack Launch Unlimited 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన డిజిటల్ ఆఫర్‌ను రిలయన్స్ జియో ప్రకటించింది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, కాల్స్ తో పాటు ఫైబర్ సేవలు కూడా అందిస్తోంది. 

కొత్త సిమ్ లో కేవలం రూ.349తో లభించే జియో స్టార్టర్ ప్యాక్ వినియోగదారులకు అపరిమిత 5G సేవలతో పాటు, క్లౌడ్ స్టోరేజ్, ఫైబర్ ట్రయల్ కనెక్షన్, ఓటీటీ సేవలను ఒకే ప్యాక్‌లో అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మరింత విస్తృతంగా అందుకునేలా చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది.

25
జియో స్టార్టర్ ప్యాక్ వివరాలు
Image Credit : Google

జియో స్టార్టర్ ప్యాక్ వివరాలు

జియో స్టార్టర్ ప్యాక్ ద్వారా వినియోగదారులకు చాలా ప్రయోజనలే అందుతున్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రయోజనాలు గమనిస్తే..

28 రోజుల పాటు అపరిమిత 5G సేవలు: భారతదేశంలో వేగవంతమైన 5G నెట్‌వర్క్‌ను అనుభవించే అవకాశం లభిస్తుంది. మీకు మొబైల్ లో అన్ లిమిటెడ్ కాల్స్, డేటా లభిస్తుంది.

50 రోజుల ఉచిత జియో ఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్: జియో స్టార్టర్ ప్యాక్ తో మీకు 50 రోజులు జియో ఫైబర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. టీవీ, Wi-Fi, ప్రముఖ OTT యాప్‌లతో ఇంటర్నెట్ ఎంటర్టైన్‌మెంట్‌ను మీకు అందిస్తుంది.

50GB ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజ్: జియో స్టార్టర్ ప్యాక్ తో మీకు డేటా స్టోరేజ్ అవసరాల కోసం ఉచిత క్లౌడ్ ప్లాట్‌ఫాం కూడా అందుబాటులో ఉంటుంది. 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ లభిస్తుంది.

90 రోజుల పాటు 4K నాణ్యతలో జియో హాట్‌స్టార్ ఉచితం: జియో స్టార్టర్ ప్యాక్ లో మీకు 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ సేవలు ఉచితంగా లభిస్తాయి. జియో హాట్ స్టార్ ను టీవీ లేదా మొబైల్‌లో చూడవచ్చు.

ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో కలిపి అందించడం ద్వారా, వినియోగదారులకు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే పూర్తి డిజిటల్ యూటిలిటీ అందేలా చేయడమే జియో ఉద్దేశంగా సంస్థ పేర్కొంది.

Related Articles

Related image1
Reliance Jio సూపర్ ఆఫర్: ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు
Related image2
Reliance Jio: జియోలో అన్‌లిమిటెడ్ 5G డేటా జస్ట్ రూ.198కే: ప్లాన్ అదిరిపోయిందిగా!
35
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి జియో స్టార్టర్ ప్యాక్ సేవలు
Image Credit : Google

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి జియో స్టార్టర్ ప్యాక్ సేవలు

జియో స్టార్టర్ ప్యాక్ సేవలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. జియో రిటైలర్లు, పార్ట్‌నర్ అవుట్‌లెట్లు వద్ద మీరు ఈ సేవల వివరాలు పొందవచ్చు. వినియోగదారులు కొత్త మొబైల్ (కొత్త సిమ్ కు మాత్రమే) కొనుగోలు సమయంలో వెంటనే ఈ స్టార్టర్ ప్యాక్‌ను సులభంగా పొందవచ్చు.

45
టెలికాం రంగంలో జియో సంచలనం
Image Credit : Google

టెలికాం రంగంలో జియో సంచలనం

TRAI విడుదల చేసిన తాజా నివేదిక (ఏప్రిల్ 2025) ప్రకారం, జియో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో (తెలంగాణతో సహా) మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. మొబైల్ సేవలు, ఫైబర్ సేవలలో అధిపత్యం కొనసాగిస్తోంది.

జియో మొబైల్ విభాగం (Wireless Mobility): జియో ఏప్రిల్ 2025లో 95,310 కొత్త వినియోగదారులను జోడించి, మొత్తం కస్టమర్ బేస్‌ను 3,18,71,384కు పెంచుకుంది.

జియో వైర్లైన్ బ్రాడ్‌బ్యాండ్ (Jio Fiber): జియో ఏప్రిల్‌లో 54,000 కొత్త ఫైబర్ కనెక్షన్లతో తన బేస్‌ను 1.66 మిలియన్‌కి పెంచుకుంది.

జియో ఎయిర్‌ఫైబర్ (5G Fixed Wireless Access): ఇక్కడ జియో వేగంగా అభివృద్ధి చెందుతూ 523,000 సబ్‌స్క్రైబర్లతో, జనవరిలో ఉన్న 427,439తో పోలిస్తే గణనీయంగా ఎదిగింది. ప్రాంతీయంగా 80% మార్కెట్ షేర్ దక్కించుకుంది.

55
వేగం, ధర, లభ్యతతో జియో సంచలనాలు
Image Credit : Google

వేగం, ధర, లభ్యతతో జియో సంచలనాలు

జియో ఈ అద్భుత విజయాన్ని సాధించగలగడం వెనుక ఉన్న మూడు ప్రధాన అంశాలు గమినిస్తే..

1. అత్యుత్తమ 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలు

2. సరసమైన ధరలు

3. రూరల్ & సెమి అర్బన్ ప్రాంతాలలో కనెక్టివిటీ అందించే సామర్థ్యం

గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ వేసే సామర్థ్యం లేకపోయినా, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను సులభంగా అందిస్తోంది. ఇది వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తోంది.

ఇప్పుడు కొత్తగా రూ. 349తో ప్రారంభమయ్యే ఈ జియో స్టార్టర్ ప్యాక్ కొత్త వినియోగదారుల కోసం ఒక గేట్‌వేలా మారుతోంది. అపరిమిత 5G, AI క్లౌడ్, OTT, బ్రాడ్‌బ్యాండ్ వంటి ప్రయోజనాలను ఒకే ప్యాక్‌లో అందించడం ద్వారా జియో మరోసారి డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, జియో స్టార్టర్ ప్యాక్ మీకు గొప్ప ఎంపిక కావచ్చు. మరింత సమాచారం కోసం సమీప జియో స్టోర్‌ను సంప్రదించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved