MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • మీరింకా ఐటీఆర్ సబ్మిట్ చేయలేదా? ఈ తేదీ లోపు కట్టేయండి

మీరింకా ఐటీఆర్ సబ్మిట్ చేయలేదా? ఈ తేదీ లోపు కట్టేయండి

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయించడం కుదరలేదా? సెంట్రల్ గవర్నమెంట్ మీకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఐటీఆర్ ఫైలింగ్ చేయించడం లేట్ చేసిన వారు ఈ గడువు లోగా రిటర్న్స్ సబ్మిట్ చేయాలని సూచించింది. ఈ గడువును దాటితే జరిమానాలు మరింత పెరుగుతాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కోల్పోతారు. ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించి గడువు తేదీ, సబ్మిట్ చేసే విధానం లాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 12 2024, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారంతా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయాల్సిన గడువు జులై 31. అంటే అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కు ఐటీఆర్ సబ్మిట్ చేయాలన్న మాట. జులై 31 లోపు సబ్మిట్ చేయని వారికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 చివరి తేదీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువులోగా కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయించకపోతే ఫైన్ అమౌంట్ పెరుగుతుంది. పన్ను సంబంధిత ప్రయోజనాలను కూడా మీరు పొందలేరు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం ఐటీఆర్ ను గడువు లోపు కట్టలేని వారు డిసెంబర్ 31 నాటికి ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. అయితే దీనికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రూ.5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు మాత్రం రూ.1,000 జరిమానా కట్టాలి. 

35

డిసెంబర్ 31 లోపు కూడా మీరు ఐటీఆర్ కట్టకపోతే మార్చి 31, 2025 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాంటి వారు ఏకంగా రూ.10,000 ఫైన్ కట్టాలి. చెల్లించని పన్నులపై ఆగస్టు 1 నుండి నెలకు 1 % వడ్డీ కూడా చెల్లించాలి. ఈ గడువు తప్పితే విలువైన ట్యాక్స్ బెనిఫిట్స్ ని మీరు కోల్పోతారు.

45

ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసేవారు సెక్షన్ 80C, 80D ప్రకారం పాత పన్ను విధానం కింద లభించే ట్యాక్స్ కన్సషన్స్ ను మిస్ అవుతారు. భవిష్యత్తు లాభాలను పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడి నష్టాలను తప్పించుకోవడానికి మీకు ఎలాంటి సహాయం అందకపోవచ్చు. ఇది భవిష్యత్తు ఎదుగుదలపై ప్రభావితం చూపిస్తుంది.

55

ఐటీఆర్‌ను ఎలా దాఖలు చేయాలి:

ఐటీఆర్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం చాలా సులభం. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా దీన్ని మీరు చేయవచ్చు. 

https://www.incometax.gov.in సైట్ ఓపెన్ చేయండి. 
మీ పాన్ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కి సరైన ఐటీఆర్ ఫారమ్‌ను సెలక్ట్ చేసుకోండి.
అవసరమైన వివరాలను పూర్తి చేయండి. మీకు అప్లికబుల్ అయ్యే మినహాయింపులను క్లెయిమ్ చేయండి.
లేట్ ఫీ(రూ. 5,000 లేదా రూ. 1,000) చెల్లించండి.
ఫారమ్‌ను సమర్పించి, ఆధార్ OTP ద్వారా సబ్మిట్ చేయండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved