ఇజ్రాయెల్-పాలస్తీనా వార్ ఎఫెక్ట్ : 5 శాతం పెరిగిన క్రుడయిల్ ధరలు .. ఇండియాలో పెట్రోల్ ధర పెరగనుందా ..?
ఇజ్రాయెల్ - పాలస్తీనా గ్రూప్ హమాస్ మధ్య యుద్ధానికి ప్రతీకగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రుడయిల్ ధరలు 5 శాతం పెరిగాయి. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ యుద్ధం జరిగిన కొద్ది రోజుల్లోనే ఇరువైపులా వెయ్యి మందికి పైగా చనిపోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్ 5,000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నాయి.
ఈ యుద్ధానికి ప్రతిస్పందనగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రుడయిల్ ధరలు 5% పెరిగాయి. అక్టోబర్ 6 నుండి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 84.58 డాలర్ల నుంచి 89 డాలర్లకు పెరిగింది.
ప్రపంచంలోని ముడి చమురు అవసరాలలో మూడింట ఒక వంతు పశ్చిమాసియా నుండి వస్తున్నందున, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భారతదేశంతో సహా అనేక దేశాలను ప్రభావితం చేసే సమస్యగా మారింది.
పశ్చిమ టెక్సాస్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా క్రుడయిల్ ధరలు బ్యారెల్‌కు 87 డాలర్లకు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 4.18 డాలర్లు లేదా 4.99 శాతం పెరిగి 88.76 డాలర్ల వద్ద ఉంది. డబ్ల్యూటీఐ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 5.11 శాతం పెరిగి 87.02 డాలర్లకు చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ కష్టతరమైన తీవ్ర యుద్ధాన్ని ప్రారంభిస్తోందని, లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అన్నారు.
"హమాస్ హింసాత్మక దాడి ద్వారా యుద్ధం మాపై విధించబడింది. మా భూభాగంలోకి ప్రవేశించిన చాలా శత్రు దళాలను నాశనం చేయడంతో మొదటి దశ ముగిసింది. అలాగే మేము మా లక్ష్యాలను చేరుకునే వరకు మా దాడి విశ్రాంతి లేకుండా కొనసాగుతుంది. మేము ఇజ్రాయెల్ పౌరులకు భద్రతను పునరుద్ధరిస్తాము, మేము గెలుస్తాము" అని నెతన్యాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.