మీరు 75 శాతం డిస్కౌంట్ తో ట్రైన్ లో ప్రయాణించొచ్చు తెలుసా? IRCTC స్పెషల్ ఆఫర్
ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC రైల్వే టిక్కెట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ సంస్థ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్నివిమాన టిక్కెట్లపై ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఆఫర్ల ప్రకటనలో భాగంగా ఇప్పుడు 75 శాతం రాయితీతో రైలులో ప్రయాణించే సౌకర్యాన్ని ప్రయాణికులకు ఇస్తోంది. దీంతో పాటు టిక్కెట్లపై మరికొన్ని డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. అలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందించే ప్రభుత్వ రంగ సంస్థ. ఇది 1999లో అప్పటి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకు IRCTCలో 66 మిలియన్ల మందికి పైగా నమోదై ఉన్నారు. రోజుకు దాదాపు 7.31 లక్షల టిక్కెట్లు IRCTC ద్వారా బుక్ అవుతున్నాయి.
రోజుకు దాదాపు 7.31 లక్షల టిక్కెట్ల బుకింగ్
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ల ద్వారానే అన్ని పనులు చేసేస్తున్నారు. ఐటమ్ ఏదైనా ఆన్ లైన్ లో బుక్ చేసిన వెంటనే ఇంటికి డోర్ డెలివరీ చేసేస్తున్నారు. ఇక టికెట్ల బుకింగ్ అయితే మరింత సింపుల్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రైల్వే టిక్కెట్లు కూడా ఇంతే సింపుల్ గా ప్రజలు బుక్ చేసుకుంటున్నారు. రోజుకు దాదాపు 7.31 లక్షల టిక్కెట్లు IRCTC ద్వారా బుక్ అవుతున్నాయంటే మొబైల్ యాప్స్, వెబ్ సైట్లను ప్రజలు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆన్ లైన్ లో డిస్కౌంట్ ధరలు కూడా ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇతర ప్రయాణ ఖర్చులతో పోలిస్తే తక్కువ ధర, ఆహ్లాదకరమైన ప్రయాణం ట్రైన్స్ లోనే సాధ్యమవుతుంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
IRCTC 25వ వార్షికోత్సవం
భారత ప్రభుత్వంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ మైలురాయిని చేరుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు విమానాలు, రైళ్లలో టిక్కెట్లపై ప్రత్యేక తగ్గింపులను ఇస్తోంది. ఈ మేరకు IRCTC ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
విమాన టిక్కెట్లపై IRCTC డిస్కౌంట్స్
IRCTC తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విమాన టిక్కెట్లపై ప్రత్యేక డిస్కౌంట్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 28 లోపు air.irctc.co.in వెబ్‌సైట్ ద్వారా లేదా IRCTC ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ప్లయిట్ టిక్కెట్స్ కొనుగోలు చేసిన వారికి టిక్కెట్ ధరలో 12 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చింది. అంతేకాకుండా విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ప్యాసింజర్ కి రూ.50 లక్షల ప్రమాద బీమా కూడా ఇచ్చింది.
రైల్వే టిక్కెట్లపై డిస్కౌంట్ పొందడానికి అర్హులు వీరే..
హైస్పీడ్, ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లతో సహా ఇతర రైల్వే సేవల్లోనూ IRCTC డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం విద్యార్థులు, అంధులు, వికలాంగులు, పారా పెలాజిక్, క్షయ, క్యాన్సర్ రోగులు, కిడ్నీ, లెప్రసీ రోగులకు ఛార్జీల్లో రాయితీలు ఇస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భద్రతా బలగాల జీవిత భాగస్వాములు, యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలు, జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు, లేబర్ అవార్డు గ్రహీతలు, పోలీసు అమరవీరుల భార్యలు, సీనియర్ సిటిజన్లు టిక్కెట్ ధరలో రాయితీలు పొందడానికి అర్హులు.
75 శాతం డిస్కౌంట్స్ వీరికే...
ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు IRCTC భారీ రాయితీలు ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షల కోసం రైలులో ప్రయాణించాల్సి వస్తే వారికి 75 శాతం వరకు రాయితీ ఇస్తోంది. అలాగే UPSC, సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ మెయిన్స్‌కు హాజరయ్యే విద్యార్థులు టిక్కెట్ ధరపై 50% వరకు తగ్గింపు పొందవచ్చు. రైల్వే గుర్తించిన గుండె జబ్బులు, కిడ్నీ రోగులు, క్యాన్సర్ రోగుల వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా టికెట్ ధరపై 75 శాతానికి పైగా తగ్గింపు ఇస్తున్నారు.