మీ ఇంట్లోని సీనియర్ సిటిజెన్లకు ఐఆర్సిటీసీ ఈ ఐదు ఆఫర్లను ఉచితంగా ఇస్తుంది, వాడుకోండి
ప్రతి ఇంట్లోనూ సీనియర్ సిటిజన్లు ఉండడం సహజం. ఐఆర్సిటిసి వీరి కోసం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కానీ వీటిపై అవగాహన లేక ఎవరూ వాటిని వాడుకోవడం లేదు.

సీనియర్ సిటిజెన్ల కోసం ఆఫర్లు
భారతదేశంలో ప్రతిరోజు ఎంతో మంది సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వారు సౌకర్యవంతమైన ఒత్తిడి లేని ప్రయాణాన్ని కోరుకుంటారు. అందుకోసం భారతీయ రైల్వే సంస్థ అయిన ఐఆర్సిటిసి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. కానీ ఎంతోమందికి ఆ ప్రత్యేక ప్రయోజనాలు గురించి తెలియక వాటిని వాడుకోవడం లేదు. సీనియర్ సిటిజెన్లు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఐఆర్సిసీటిసీ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
ఏ వయసు వారికి ఈ ఆఫర్లు?
మనదేశంలో ప్రతిరోజు 19 వేలకు పైగా రైళ్లు ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. ఎందుకోసం ఐఆర్సిటీసీ ప్రయాణికులకు వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజనులకు లోయర్ బెర్త్ సౌకర్యాన్ని అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 58 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ ను అందిస్తుంది. స్లీపర్, ఏసీ త్రీ టైర్, ఏసీ టూ టైర్ కోచుల్లో టికెట్లు బుక్ చేసుకుంటే వారికి కింది బెర్త్ కేటాయిస్తుంది ఐఆర్సిటిసి.
ప్రత్యేక టికెట్ కౌంటర్
టికెట్ బుక్ చేసుకునేందుకు కూడా సీనియర్ సిటిజెన్లు కష్టపడాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలో వారికంటూ ప్రత్యేక బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. పొడవైన క్యూలలో నిలుచుని కాలు నొప్పులతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వారికి ప్రత్యేక కౌంటర్లను ఐఆర్సిటిసి ముందుగానే ఏర్పాటు చేసింది. అలాగే సీనియర్ సిటిజనులతో పాటు దివ్యాంగులకు కూడా ఈ ప్రత్యేక టికెట్ బుకింగ్ కౌంటర్లు సేవలు అందిస్తాయి.
వీల్ చైర్‌లు వాడుకోవచ్చు
భారతదేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజెన్లకు ఉచిత వీల్ ఛైర్ సేవలు అందిస్తోంది. ఐఆర్సిటిసి ఎక్కువ దూరాలు ప్లాట్‌ఫాములపై నడవలేని వారి కోసం ఈ సౌకర్యం ఉంది. వీల్ చైర్‌లతో పాటు పోర్టర్లు కూడా ఉంటారు. వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైలు ఎక్కడానికి సహాయం చేస్తారు. బ్యాటరీతో నడిచే వాహనాలను కూడా వృద్ధుల కోసం వికలాంగుల కోసం అందుబాటులో ఉంచారు. రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫామ్ నుండి ప్రవేశ ద్వారాల వరకు ఈ బ్యాటరీతో నడిచే వాహనాలపై తీసుకువెళ్తారు.
లోకల్ ట్రైన్లలోనూ
ఇక లోకల్ ట్రైన్లలో కూడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లోని సబర్బన్ లోకల్ రైళ్లలో కూడా సీనియర్ సిటిజనులకు సీట్లు ఉంటాయి. వారు ఆ రైళ్లలో నిల్చుని ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.