iPhone 16e: మార్కెట్‌లో ఐఫోన్ 16e కి ఫుల్ డిమాండ్.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే!
iPhone 16e: ఆపిల్ ఐఫోన్ 16e అదిరిపోయే ఆఫర్లతో మనదేశంలోకి వచ్చేసింది. మార్కెట్ లోకి వచ్చిన రెండు రోజులకే మంచి డిమాండ్ వచ్చింది. దీని ధర, ఫీచర్లు, ఇంకా బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం రండి.

ఆపిల్ కంపెనీ తన కొత్త ఐఫోన్ 16e మోడల్‌ను ఫిబ్రవరి 28 నుంచి మనదేశంలో అమ్మడం మొదలుపెట్టింది. మీరు ముందుగా బుక్ చేసుకుంటే మీ ఇంటికి డెలివరీ చేస్తారు. ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటే ఆపిల్ స్టోర్ కు వెళ్లి తీసుకోవచ్చు. ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ మోడల్, ఐఫోన్ SE పేరును మార్చేసింది. దీని ద్వారా చాలామంది కొత్త ఆపిల్ AI ఫీచర్లను వాడుకోవచ్చు.
ఐఫోన్ 16e ధర
మనదేశంలో ఐఫోన్ 16e బేసిక్ 128GB మోడల్ ధర రూ. 59,900. అదే హై-ఎండ్ 512GB మోడల్ అయితే రూ.90,000. ఈ ఫోన్లు EMIలో కూడా తీసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 67,500 వరకు తగ్గింపు వస్తుంది. కొన్ని బ్యాంకు ఆఫర్లతో రూ.4,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 16e ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్లలో దొరుకుతుంది. మీరు ఇతర నగరాల్లో ప్రైవేటు షాపుల్లో కూడా లభిస్తోంది.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 16e లో 6.1-ఇంచ్ సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ ఉంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఐఫోన్ 16, 16 ప్లస్ మోడల్స్‌లో ఉన్నట్టే ఇందులో కూడా A18 చిప్ ఉంటుంది. దీనికి 8GB RAM కూడా ఉంది. కాబట్టి ఇది ఆపిల్ AI టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్‌లో ఫేస్‌టైమ్, వీడియో రికార్డింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా, 48MP వెనుక కెమెరా ఉన్నాయి. మిగతా ఐఫోన్ల లాగే ఇది కూడా ఫేస్ ఐడీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది.