ఆల్ టైమ్ అతి తక్కువ ధరకు ఐఫోన్ 16 ప్లస్, పాత ఫోన్ మీద బంపర్ ఆఫర్
iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్ ఫోన్లపై భారీ ఆఫర్ వచ్చింది. రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇంతకన్నా మంచి ఆఫర్ రాదు. ఏకంగా పాతిక వేల రూపాయలు తగ్గింపు ఇస్తున్నారు.

ఐఫోన్ 16 ప్లస్ ధర
రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు ఇచ్చారు. సాధారణంగా దీని ధర రూ.89,900. ఇప్పుడు దానిపై పాతికవేల రూపాయలకు పైగా తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు దాని ధర ఇప్పుడు రూ.67,990. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ.4,000 అదనపు తగ్గింపు ఉంది. రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ను ఇచ్చి రూ.26,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ ఫీచర్లు
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ లో ఎన్నో ఫీచర్లు ఉంటాయి. 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ఆపిల్ కొత్త A18 చిప్‌సెట్ ఉంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 16 ప్లస్‌లో శక్తివంతమైన కెమెరా సిస్టమ్ కూడా ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 12MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
ఐఫోన్ 16 ప్లస్ ఆఫర్
ఐఫోన్ 16 ప్లస్ 4674mAh బ్యాటరీతో ఇది నడుస్తోంది. ఇది ఎక్కువ సమయం బ్యాటరీ నడుస్తోంది. IP68 రేటింగ్ ఉండటంతో ఇది నీరు, ధూళి నుండి సురక్షితంగా ఉంటుంది. ఇది అయిదు రంగులలో లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్ ఈ మెగా ఆఫర్, ఐఫోన్ కొనాలనుకునే వారికి ఒక గొప్ప అవకాశం. రూ.25,910 వరకు తగ్గింపు, ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.