Gold Rate: భారీగా పడిపోతున్న బంగారం ధర, ఈ రోజు ఎంత తగ్గిందో తెలుసా?
మనదేశంలో చాలా నెలల తరువాత బంగారం ధరలో (Gold Rate) తగ్గుదల కనిపిస్తోంది. గత ఆరు రోజులుగా బంగారం ధర వరుసగా ఎంతోకొంత తగ్గుతూ వస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 8 వేల రూపాయల దాకా తగ్గింది.

బంగారం ధర తగ్గుతోంది
మనదేశంలో బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి. ఇవి ఎవ్వరూ ఊహించనిది. గత ఆరు రోజులుగా బంగారం ధర తగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 8 వేల రూపాయలకు పైగా తగ్గింది. దీంతో బంగారం కొనాలనుకునేవారు ఎంతో సంతోషపడుతున్నారు.
వెండి ధరలు
బంగారం ధర అన్నిచోట్లో ఒకేలా ఉండదు. నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలాగే 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరల్లో ఎంతో తేడా ఉంటుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ.1,000 వరకు తగ్గింది. బంగారం, వెండి ధరలు రెండూ తగ్గడం మహిళలకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయం.
22 క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము: 11,465 రూపాయలు
8 గ్రాములు: 91,720 రూపాయలు
10 గ్రాములు: 1,14,650 రూపాయలు
100 గ్రాములు: 11,46,500 రూపాయలు
24 క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము: 12,508 రూపాయలు
8 గ్రాములు: 1,00,064 రూపాయలు
10 గ్రాములు: 1,25,080 రూపాయలు
100 గ్రాములు: 12,50,800 రూపాయలు
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు ఇక్కడ ఇచ్చాము. చెన్నై: 1,15,000 రూపాయలు, ముంబై: 1,14,650 రూపాయలు, ఢిల్లీ: 1,14,800 రూపాయలు, కోల్‌కతా: 1,14,650 రూపాయలు, బెంగళూరు: 1,14,650 రూపాయలు, హైదరాబాద్: 1,14,650 రూపాయలు, వడోదర: 1,14,700 రూపాయలుగా ఉంది.

