- Home
- Business
- Post Office RD: పోస్ట్ ఆఫీస్ సూపర్ సేవింగ్స్ స్కీం.. రోజుకి రూ.166 కడితే 8 లక్షలు మీ సొంతం
Post Office RD: పోస్ట్ ఆఫీస్ సూపర్ సేవింగ్స్ స్కీం.. రోజుకి రూ.166 కడితే 8 లక్షలు మీ సొంతం
సాధారణంగా చాలా మంది డబ్బులు పొదుపు చేస్తుంటారు. కానీ సరైన మార్గంలో పొదుపు చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ఏ పథకంలో డబ్బులు పెడితే మనకు మంచి రాబడి వస్తుందో తెలుసుకోవాలి. సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకోవాలి. దానికి సరైన మార్గం పోస్ట్ ఆఫీస్ RD పథకం.

డబ్బులు పొదుపు చేయడం చాలా మంచి అలవాటు. ఎవరైనా సరే వారికి వచ్చే నెలసరి ఆదాయంలో కొంతమొత్తం సేవ్ చేసుకుంటేనే వారి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడ పొదుపు చేస్తే మనకు మేలు జరుగుతుందనేది కచ్చితంగా తెలిసి ఉండాలి.
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అందరిని ఆకర్షిస్తోంది. చిన్న మొత్తంలో పొదుపు చేస్తే రిటర్న్స్ లక్షల్లో ఉంటున్నాయి. ఇంతకీ ఆ పథకం ఏంటీ? నెల నెల ఎంత జమ చేస్తే.. తిరిగి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 5వేలు కడితే..
దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా ఉత్తమమైనవి. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లు మంచి రాబడిని ఇస్తాయి. ప్రతినెలా 5వేల రూపాయల చొప్పున జమ చేస్తే, పదేళ్ల తర్వాత దాదాపు 8 లక్షల రూపాయల వరకు చేతికి వస్తాయి.
6.7 శాతం వడ్డీ
2023లో ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ RD వడ్డీ రేటును పెంచింది. దీనివల్ల పెట్టుబడిదారులకు చాలా లాభం జరుగుతుంది. అక్టోబర్-డిసెంబర్ 2023కి 6.7%గా నిర్ణయించారు. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తారు. దీంతో వడ్డీ ఏటా పెరుగుతుంది. పొదుపు స్థిరంగా వృద్ధి చెందుతుంది.
లోన్ సౌకర్యం:
నెలకు రూ. 5,000 డిపాజిట్ చేస్తే, ఐదు సంవత్సరాల్లో రూ. 3 లక్షలు వస్తాయి. 6.7% వడ్డీతో, మొత్తం వడ్డీ రూ.56,830 అవుతుంది. మొత్తం రూ.3,56,830లను మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే రూ. 2,54,272 వడ్డీతో రూ.8,54,272కి పెరుగుతుంది. ఈ పథకంలో ముందస్తు ఉపసంహరణలు, లోన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మనం ఎంత మొత్తాన్ని జమ చేశామో దాంట్లో 50శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.
ఉత్తమ పొదుపు పథకం
స్థిరమైన పొదుపు వృద్ధికి పోస్ట్ ఆఫీస్ RD ఉత్తమమైంది. మంచి రాబడితో పాటు లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రిస్క్ తక్కువ. పదేళ్లు పొడిగిస్తే లక్షల రూపాయలు చేతికి అందుతాయి.