Interim Budget 2024 : నీలంరంగు కాంతా చీరలో మెరిసిపోతున్న ఆర్థికమంత్రి...
నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇది మధ్యంతర బడ్జెట్ అవుతుంది.
2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించే సమయంలో ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్ నీలం, క్రీమ్-రంగు టస్సార్ చీరను ధరించారు. నీలం రంగులో ఉన్న చీరమీద మొత్తం క్రీమ్-రంగు కాంత వర్క్ ఉంది.
నిర్మలా సీతారామన్ కు సంప్రదాయ భారతీయ వస్త్రధారణ ఇష్టం. చీరలమీద ప్రేమకు ఆమె ప్రసిద్ధి చెందారు. అంతేకాదు ఆమె వివిధ రాష్ట్రాల ప్రత్యేకనేత చీరలకు అధిక ప్రాధాన్యతనిస్తారు.
అలా గతేడాది నవలగుండ ఎంబ్రాయిడరీ ఉన్న హ్యాండ్ లూమ్ఎరుపు రంగు ఇల్కల్ చీరను మంత్రి బడ్జెట్ సమయంలో కట్టుకున్నారు. ఈ చీరను కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన మంత్రి ప్రహ్లాద్ జోషి బహుమతిగా సీతారామన్ కు ఇచ్చారు. బడ్జెట్ రోజున కట్టుకునే చీరను ఎంపిక చేసిన తరువాత దానిమీద ఎంబ్రాయిడరీ పనిచేయించారు.
మధ్యంతర బడ్జెట్.. సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి కట్టుకుంటున్న ఈ చీర ఆఫ్-వైట్ లేదా క్రీమ్ కలర్ అనేది ఆర్థిక మంత్రికి చాలా ఇష్టమైనది. నిర్మలా సీతారామన్ తరచుగా క్రీమ్, హాఫ్ వైట్ చీరల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతకుముందు 2021లో, ఎరుపు, తెలుపు రంగు పోచంపల్లి చీరను ధరించారు.
2022లో, సీతారామన్ రస్ట్ కలర్ గోధుమ రంగు బొమ్కై చీరను ఎంచుకున్నారు. 2020లో, మంత్రి సన్నటి నీలం అంచుతో పూర్తిగా పసుపు రంగు పట్టు చీరలో కనిపించారు. 2019లో, ఆమె గోల్డెన్ బార్డర్‌తో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీరను ధరించింది.
బడ్జెట్ సమర్పణకు ముందు నిర్మలా సీతారామన్ అప్పటివరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృందంతో కలిసి ఆర్థికమంత్రిత్వ శాఖకు చేరుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ సమర్ఫణ విషయం తెలిపారు. రాష్ట్రపతి ఆర్థికమంత్రికి శుభసూచకంగా పెరుగు తినిపించారు.
అనంతరం బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం లభించింది.