MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Indian Railways: రైళ్లలో ఫుడ్ మెనూ కావాలంటే ఇకపై ఎస్ఎంఎస్ చేస్తే చాలు

Indian Railways: రైళ్లలో ఫుడ్ మెనూ కావాలంటే ఇకపై ఎస్ఎంఎస్ చేస్తే చాలు

Indian Railways: రైళ్లలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనం డెలివరీ చేస్తారు కదా.. వాటి ధరలు ఎంతుటాయోనని ఇకపై మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మెనూ, వాటి ధరల లింక్‌లతో ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 15 2025, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో నాలుగో స్థానంలో ఉంది. రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. మన దేశంలో సాధారణ ప్యాసింజర్ రైళ్ల నుంచి వందే భారత్ లాంటి లగ్జరీ రైళ్ల వరకు అన్ని రకాల రైళ్లు నడుస్తున్నాయి. వేల కి.మీ. ప్రయాణించే రైళ్లు, రోజుల తరబడి నడిచే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అందుకే చాలా రైళ్లలో టిఫెన్స్, భోజనం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రైళ్లలో ప్రయాణికులకు తక్కువ ధరకే భోజనం పెడతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో భోజనం కచ్చితంగా ఉంటుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు వారు ప్రయాణించే రైళ్లలో భోజనం ధరలు, మెనూ గురించి తెలీదు. అందుకే SMS ద్వారా మెనూ, ధరల వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్ సభలో చెప్పారు.

ఇది కూడా చదవండి 9 రాష్ట్రాలు.. 4,189 కి.మీ.. 74 గంటల ప్రయాణం.. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ ఇదే

 

34

IRCTC వెబ్‌సైట్‌లో మెనూ, ధరలు ఉంటాయి. సిబ్బంది దగ్గర మెనూ కార్డులు కూడా ఉంటాయి. కావాలంటే ప్రయాణికులు వాటిని అడగవచ్చు అని మంత్రి లోక్‌సభలో చెప్పారు.

మెనూ కార్డు, ధరల గురించి, పరిశుభ్రత గురించి కూడా మంత్రి వైష్ణవ్ మాట్లాడారు. వంటశాలల్లో CCTV కెమెరాలు పెట్టామని, మంచి నాణ్యమైన పదార్థాలు వాడుతున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి మీకు ట్రైన్ టికెట్ బుక్ చేయడం తెలియదా? ఈ విషయాలు తెలిస్తే ఇంత ఈజీనా అంటారు

44

ప్రయాణికుల కోసం తయారు చేసే ఆహార పదార్థాల్లో వంట నూనె, బియ్యం, పప్పులు, మసాలాలు, పాల ఉత్పత్తులు అన్నీ మంచి బ్రాండ్ వాడుతున్నామని మంత్రి చెప్పారు. IRCTC సిబ్బంది రైళ్లలో ఉంటారని, ఫుడ్ ప్యాకెట్లపై QR కోడ్‌లు కూడా పెట్టామని దాని ద్వారా ఆ ఫుడ్ కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 

ప్యాంట్రీ కార్లలో ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో తనిఖీ చేస్తామని, కస్టమర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. FSSAI సర్టిఫికేషన్ కూడా తప్పనిసరి చేశామని అశ్విని వైష్ణవ్ అన్నారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image2
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Recommended image3
Gold Price Crash: బంగారం ధరలపై దిగుమతి సుంకం ఎఫెక్ట్...దిగొచ్చిన పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved