- Home
- Business
- Tatkal Ticket: మీకు కన్ఫర్మ్‌గా తత్కాల్ టికెట్ కావాలా? అయితే వెంటనే ఆధార్ లింక్ చేయండి: రైల్వే కొత్త రూల్స్ ఇవే
Tatkal Ticket: మీకు కన్ఫర్మ్‌గా తత్కాల్ టికెట్ కావాలా? అయితే వెంటనే ఆధార్ లింక్ చేయండి: రైల్వే కొత్త రూల్స్ ఇవే
మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా? అయితే ఇకపై ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అది కూడా మొబైల్ నంబర్ తో లింకైన ఆధార్ ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
IRCTC ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోవాలి
తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ లో ఇండియన్ రైల్వే పెద్ద మార్పు తీసుకొచ్చింది. అదేంటంటే.. IRCTC అకౌంట్ ఆధార్ తో లింక్ అయి ఉండకపోతే తర్వాత తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల ప్రయాణికులు తమ IRCTC ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియన్ రైల్వేలో రోజుకి సగటున 2.25 లక్షల మంది తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ అకౌంట్లలో చాలా వరకు ఆధార్ వెరిఫికేషన్ లేకుండానే ఉన్నాయి. అందుకే ఆధార్ వెరిఫికేషన్ ఉన్న యూజర్లకు మొదటి 10 నిమిషాల్లోనే బుకింగ్ అవకాశం ఇవ్వాలని రైల్వే నిర్ణయించింది.
మొబైల్, ల్యాప్ టాప్ ద్వారా టికెట్లు బుక్ చేసే వారికి ఉపయోగం
రైల్వే కొత్త రూల్ ముఖ్యంగా మొబైల్, ల్యాప్ టాప్ ద్వారా రోజూ టికెట్లు బుక్ చేసుకునే వారికి, త్వరగా కన్ఫర్మ్ టికెట్ కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తత్కాల్ టికెట్ ఆధార్ లింక్ అయిన అకౌంట్ కే త్వరగా లభిస్తుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ మొదటి 10 నిమిషాల్లో IRCTC అకౌంట్ ఆధార్ తో లింక్ అయిన వాళ్ళు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మొదటి 10 నిమిషాల్లో ఆథరైజ్డ్ ఏజెంట్లు కూడా టికెట్లు బుక్ చేయలేరు. నకిలీ బుకింగ్ లను ఆపడమే ఈ నిర్ణయం ఉద్దేశమని రైల్వే శాఖ వెల్లడించింది.
ఆధార్ తో లింకైన అకౌంట్లు 10 శాతం కంటే తక్కువే
IRCTC దాదాపు 13 కోట్ల యూజర్లను కలిగి ఉంది. వీరిలో 1.2 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు మాత్రమే ఆధార్ తో లింక్ అయి ఉన్నాయని సమాచారం. మిగతా యూజర్లు త్వరగా ఆధార్ లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరుతోంది. లేకపోతే అలాంటి అకౌంట్లను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది.
ఇ-ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి
కౌంటర్ నుండి బుక్ చేసే తత్కాల్ టికెట్లకు కూడా త్వరలోనే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై సూచనప్రాయంగా మాట్లాడారు.
ఇ-ఆధార్ వెరిఫికేషన్ తర్వాతే ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ ఇస్తామని చెప్పారు. రోజుకి సగటున 2.25 లక్షల మంది తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటుంటే వాటిల్లో వాటిల్లో అనుమానాస్పద బుకింగ్ లు కూడా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి దాదాపు 20 లక్షల అకౌంట్లను రైల్వే విచారణ చేపడుతోందని తెలిపారు.
IRCTC అకౌంట్ ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..?
www.irctc.co.in వెబ్సైట్ కి వెళ్ళండి.
యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
‘మై అకౌంట్’ సెక్షన్ కి వెళ్ళండి.
‘లింక్ యువర్ ఆధార్’ పై క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయండి.
OTP ఎంటర్ చేసి వెరిఫై చేయండి, ‘అప్డేట్’ మీద క్లిక్ చేయండి.
ఇలా చేస్తే మీ అకౌంట్ ఆధార్ తో లింక్ అవుతుంది.