Income tax Notice: బ్యాంకులో డబ్బులు ఎన్ని దాచారు..? లిమిట్ దాటితే ఐటీ రైడ్స్ తప్పవు..!
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలలో మీ మొత్తం నగదు డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే, బ్యాంకులు ఆర్థిక లావాదేవీల నివేదిక (SFT) నిబంధనల ప్రకారం ఆదాయపన్ను శాఖకు నివేదించాలి.

ఆదాయ పన్ను నోటీసులు..
డిజిటల్ లావాదేవీలు, UPI, ఆన్ లైన్ బ్యాంకింగ్ యుగంలో నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. అయితే, చిన్న చిన్న అవసరాలకు కూడా ఫోన్లు ఏం వాడతాం లే అని.. క్యాష్ క్యారీ చేసేవారు కూడా ఉన్నారు. రోజువారీ చిన్నపాటి కొనుగోళ్లకు నగదు వాడటం చాలా కామన్. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా నార్మల్ గానే చూస్తుంది. కానీ, అధిక మొత్తంలో నగదు లావాదేవీలు మాత్రం ఆదాయ పన్ను శాఖ( Income tax department) దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ శాఖ అధికారుల కన్ను మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే డబ్బు వాడే విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొన్ని రకాల నగదు లావాదీలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మీరు కొన్ని లిమిట్స్ మించితే మీకు ఐటీ అధికారులు నోటీసులు పంపే అవకాశం ఉంది. మీరు ఎలాంటి తప్పులు చేస్తే.. ఐటీ శాఖ అధికారుల దృష్టి కి వెళ్లే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
సేవింగ్స్, కరెంట్ అకౌంట్...
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలలో మీ మొత్తం నగదు డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే, బ్యాంకులు ఆర్థిక లావాదేవీల నివేదిక (SFT) నిబంధనల ప్రకారం ఆదాయపన్ను శాఖకు నివేదించాలి. ఇది సేవింగ్, కరెంట్ అకౌంట్ రెండింటికీ వర్తిస్తుంది.
అటువంటి సమాచారం ITDకి చేరిన తర్వాత, మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అడిగే అవకాశం ఉంది. ఆ డబ్బులకు మీరు రుజువు చూపిస్తే... సమస్య ఏమీ ఉండదు. అలా చూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వ్యాపార ఆదాయం అయినా, ఆస్తి ఒప్పందాల నుండి వచ్చే డబ్బు అయినా, లేదా బహుమతి డబ్బు అయినా, సంక్లిష్టతలను నివారించడానికి సరైన రికార్డులను ఉంచడం చాలా ముఖ్యం. భారతదేశంలో స్థిర డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా మిగిలిపోయాయి. కానీ పెద్ద మొత్తంలో నగదు FDలలో జమ చేసినప్పుడు, ఐటీ అధికారులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ FDలను జమ చేస్తే, దానిని పన్ను శాఖకు నివేదించాలి.
రూ. 10 లక్షలకు పైగా నగదు లావాదేవీలపై అధికారుల నిఘా
బహుళ బ్యాంక్ ఖాతాలు లేదా ఉమ్మడి ఖాతాలుగా నగదు లావాదేవీలను విభజించినా, అవి ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) దృష్టికి రావడం తప్పదు. ఒక వ్యక్తి లేదా సంస్థ రూ. 10 లక్షలకుపైగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నగదు చలామణి చేస్తే, అది పన్ను ఎగవేతకు సంకేతంగా భావించి పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, ఒకరు ఎక్కువ మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేస్తే, ఆ డబ్బు మూలాన్ని చట్టబద్ధంగా నిరూపించే ఆధారాలు, ఉదాహరణకు ఆదాయ రుజువులు, అమ్మకపు ఒప్పందాలు లేదా బ్యాంక్ రసీదులు ఉండాలి. లేదంటే, పన్ను శాఖ వారు నోటీసులు జారీ చేయవచ్చు.
రూ. 30 లక్షలకుపైగా నగదు – రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లు
భారతదేశంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులు జరగడం సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వం నగదు ఆధారిత చెల్లింపులపై కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది. మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేసి రూ. 30 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, ఆ వివరాలను ఆస్తి రిజిస్ట్రార్ తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అంటే, ఇంతటి పెద్ద నగదు లావాదేవీలు అధికారికంగా నమోదు అవుతాయి. ఇలా జరగడం వల్ల, నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులు చేయాలనుకునే వారికి ఇది హెచ్చరిక అవుతుంది.
అధికారుల నుంచి తప్పించుకోలేరు..
ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యినప్పటికీ, కొంతమంది ఇంకా నగదే సౌలభ్యంగా అనిపించి పెద్ద మొత్తాల్లో నగదు వినియోగిస్తుంటారు. అయితే, రూ.10 లక్షలకుపైగా నగదు లావాదేవీలు చట్టపరంగా అనుమతించబడ్డా, అవి ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కొంతమంది ఈ మొత్తం నగదును విభిన్న ఖాతాల్లో లేదా ఉమ్మడి ఖాతాల రూపంలో విడగొట్టి ఉంచినా, ఐటీ శాఖ దృష్టి నుంచి తప్పించలేరు. ఆ మొత్తానికి సరైన ఆధారాలు లేకపోతే లేదా ఆదాయాన్ని నివేదించకపోతే, పన్ను ఎగవేత అనుమానంతో నోటీసు రావచ్చు.
మీరు ఎఫ్‌డీల్లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నట్లయితే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చట్టబద్ధమైన ఆధారాలు ఉండటం చాలా అవసరం. ఉదాహరణకు – అమ్మకపు ఒప్పందాలు, ఆదాయ రసీదులు, వారసత్వ ఆధారాలు వంటివి సిద్ధంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్లు లేకపోతే, మీరు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.
రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నగదు చెల్లింపులు
రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నగదు చెల్లింపులు – ఐటీ శాఖ దృష్టిలోనే!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో గతంలో నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. కానీ ఇటీవల ప్రభుత్వం నగదు ఆధారిత వ్యవహారాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. మీరు ఒక ఆస్తి కొనుగోలు చేసి రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, ఆ వివరాలు ఆస్తి రిజిస్ట్రార్ ద్వారా ఆదాయపు పన్ను శాఖకు చేరతాయి.
దీంతో పాటు, ఈ రకమైన లావాదేవీలు Annual Information Return (AIR) కింద నమోదవుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు లేదా స్టాంప్ డ్యూటీని తప్పించుకోవడం కోసం నగదు చెల్లింపులు చేస్తే, దానిపై తక్షణమే విచారణ జరగుతుంది.
మీ లావాదేవీకి సంబంధించిన పాన్ నంబర్, ఆదాయ వివరాలు , డబ్బు మూలాన్ని ఐటీ అధికారులు అడిగే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు నల్లధనం లేదా బినామీ ఆస్తి అనిపిస్తే, బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు.