- Home
- Business
- Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Dmart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే తక్కువ డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనేయవచ్చు
Dmart Shopping: తక్కువ డబ్బులకి ఎక్కువ వస్తువులు కావాలంటే అందరూ డీమార్ట్ కే వెళతారు. అయితే డి మార్ట్ లో షాపింగ్ చేసే పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి. కొన్ని చిట్కాలు ఉపయోగిస్తే డీమార్ట్ లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వస్తువులను పొందవచ్చు.

డిమార్ట్ షాపింగ్ టిప్స్
రిటైల్ మార్కెట్లో డీమార్ట్ కున్న పేరు ఇంతా అంతా కాదు. మధ్యతరగతి కుటుంబాలు అధికంగా వెళ్ళేది డీమార్ట్ కే. ఇది ఒక సరసమైన కిరాణా దుకాణంగా మారిపోయింది. శనివారం, ఆదివారం వచ్చిందంటే ఏ డిమార్ట్ సెంటర్ అయినా కిటకిటలాడి పోవాల్సిందే. అయితే డీమార్ట్ లో అన్ని వస్తువులు తక్కువ ధరకు వస్తాయన్నది నిజమే. కానీ కొంచెం తెలివిగా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించుకుంటే మీరు మరింత తక్కువ ధరకు డీమార్ట్ లో షాపింగ్ చేయవచ్చు. తక్కువ డబ్బులతోనే ఎక్కువ ఉత్పత్తులను కొనవచ్చు.
పండుగల సమయంలో షాపింగ్
ముఖ్యంగా పండుగలు సమయంలో డీమార్ట్ లో షాపింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆ సమయంలోనే డీమార్ట్ లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లు ఉంటాయి. బై వన్ గెట్ వన్ వంటి ఆఫర్లు,50 శాతం తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలోనే మీరు ఎక్కువ వస్తువులు కొనేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటివి వచ్చేస్తున్నాయి. కాబట్టి షాపింగ్ చేసేందుకు సిద్ధమైపోండి.
వీటిపై తగ్గింపు ఎక్కువ
డీమార్ట్ లో కేవలం పప్పులు, ఉప్పులు వంటివే కాదు.. ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామాన్లు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. అవి కూడా మంచి ఆఫర్లు ఉన్నప్పుడు తెలుసుకొని కొనుగోలు చేయాలి. డీమార్ట్ కు వెళ్తున్నప్పుడు అక్కడ పెట్టిన ప్రతి బోర్డు ధరలను చదవండి. అలాగే ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారో కూడా చూడండి. ధరల లేబుళ్లు చూడకుండా వెళ్ళిపోయే వారే ఎక్కువమంది. వాటిని సరిగ్గా చదివితే ఆ ఉత్పత్తులపై ఉన్న డిస్కౌంట్ ఏంటో మీకు అర్థమవుతుంది. దాన్నిబట్టి మీరు కొనుగోలు చేయవచ్చు.
ఎక్కువ సమయం కేటాయించండి
డిమార్ట్ షాపింగ్ అంత త్వరగా అయిపోదు. కనీసం గంట నుంచి రెండు గంటలు ఆ షాపింగ్ కి కేటాయించాలి. హడావుడిగా షాపింగ్ చేసి వెళ్ళిపోదామంటే తక్కువ ధరకు ఇక్కడ మీకు ఉత్పత్తులు దొరకవు. డిస్కౌంట్ లో ఏమున్నాయి? ఆఫర్లు దేనిపై ఉన్నాయో తెలుసుకోవడానికి కనీసం గంట సమయం పడుతుంది. కాబట్టి మాల్ అంతా తిరిగి ఆఫర్లు దేని మీద అధికంగా ఉన్నాయో తెలుసుకుని కొంటే మంచిది.
ఈ రోజుల్లో వెళ్లకండి
మీరు ప్రతి నెలా 10వ తేదీలోపు డిమార్ట్ కు ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఆ సమయంలోనే డీమార్ట్ కిటకిటలాడిపోతూ ఉంటుంది. అందరికీ జీతాలు వచ్చి ఉంటాయి. కాబట్టి సరుకుల కోసం డిమార్ట్ కే అందరూ వెళ్తారు. ఆ సమయంలో మీరు ఆఫర్లు డిస్కౌంట్ లో చూసేందుకు కూడా వీలు కలగదు.

