MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Money Savings: ఇందులో పెట్టుబడి పెడితే.. కేవలం వడ్డీతోనే బిందాస్ గా బతికేయచ్చు.. 100 శాతం ప్రభుత్వ గ్యారెంటీ

Money Savings: ఇందులో పెట్టుబడి పెడితే.. కేవలం వడ్డీతోనే బిందాస్ గా బతికేయచ్చు.. 100 శాతం ప్రభుత్వ గ్యారెంటీ

 Money Savings: ఈ రోజుల్లో ఏ బ్యాంక్ కూడా ఎక్కువ వడ్డీలు ఇవ్వడం లేదు. మరి.. మనం దాచుకున్న డబ్బుకు ఎక్కువ వడ్డీ వచ్చి.. ఆ వడ్డీతోనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉందా? అయితే.. ఇది మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పెట్టుబడులకు మంచి సొల్యూషన్..
Image Credit : our own

పెట్టుబడులకు మంచి సొల్యూషన్..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బులు దాచుకోవాలి అంటే..బ్యాంకుల మీదే ఆధారపడతారు. FD లో పెట్టడం లేదంటే.. సేవింగ్ అకౌంట్స్ లో ఉంచుతుంటారు. కానీ.. ప్రస్తుతం ఏ బ్యాంకు కూడా అధిక మొత్తంలో వడ్డీ రేట్లు ఇవ్వడం లేదు. మనం ఎంత దాచినా వడ్డీ చాలా తక్కువగానే వస్తుంది. అలా అని.. బయట ఎక్కడైనా వడ్డీలకు డబ్బులు ఇద్దామా అంటే.. వడ్డీ సంగతి దేవుడు ఎరగ.. ఇచ్చిన డబ్బులు చేతికి తిరిగి వస్తాయి అనే గ్యారెంటీ కూడా లేదు. ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా.. ఎక్కువ వడ్డీలు తెచ్చే టెక్నిక్ ఒకటి ఉంది.. అది ఏంటి? దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ...
Image Credit : our own

బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ...

ఇంత కాలం మనం.. బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నాం. ఇక నుంచి నార్మల్ బ్యాంకుల్లో కాకుండా.. డైరెక్ట్ గా RBI లో డబ్బులు దాచుకోవచ్చు. అదే RBI Floating Rate Savings Bonds(FRSB). ఈ బాండ్లలో మీరు పెట్టుబడి పెడితే.. ఎక్కువ వడ్డీ పొందచ్చు. ఈ బాండ్లను భారత ప్రభుత్వం తరుపున ఆర్బీఐ జారీ చేస్తుంది. కాబట్టి.. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బుకు 100 శాతం ప్రభుత్వ హామీ ఉంటుంది. అంతేకాకుండా.. వడ్డీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం ఈ బాండ్లకు సుమారు 8.05 శాతం వడ్డీ అందిస్తున్నాయి. అంటే.. మనం FD లో పెట్టిన డబ్బులకు వచ్చే వడ్డీ కన్నా ఎక్కువే.

అసలు ఏంటి ఈ FRSB..?

ఇవి RBI ద్వారా జారీ చేసే సేవింగ్స్ బాండ్లు. మీరు ఈ బాండ్లలో పెట్టుబడి పెడితే, మీ డబ్బును ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ప్రతిగా మీకు ప్రతి ఆరు నెలలకు వడ్డీ చెల్లిస్తుంది.

ఉదాహరణకు మీరు ఒక సంవత్సరానికి ఈ బాండ్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. వడ్డీ రూ.8,050 వస్తాయి. అదే రూ.5లక్షలు పెడితే..రూ.40 లక్షలు దాకా వస్తాయి. మొదట పెట్టుబడి పెట్టేటప్పుడే.. లక్షల్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు నెలకు వెయ్యి రూపాయలు కూడా ఇందులో పెట్టొచ్చు. అయితే.. పెట్టుబడి ఎక్కువ పెడితే.. మీకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే.. కనీసం 7 సంవత్సరాలైనా ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలు ఒకసారి మనం వడ్డీ డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది.

33
  FD కంటే ఈ RBI బాండ్స్ ఎందుకు బెటర్..?
Image Credit : our own

FD కంటే ఈ RBI బాండ్స్ ఎందుకు బెటర్..?

బ్యాంకు FD లకు బీమా కేవలం రూ.5లక్షల వరకు మాత్రమే ఉంటుంది. కానీ, RBI బాండ్లకు పూర్తి ప్రభుత్వ హామీ ఉంటుంది. భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నష్టం ఏమీ ఉండదు. అంతేకాదు.. వడ్డీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చాలా బ్యాంకులు 6.5శాతం నుంచి 7.5శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. RBI బాండ్లు మాత్రం ప్రస్తుతం 8 శాతానికి పైగా ఇస్తున్నాయి. అంతేకాదు.. ఈ బాండ్లలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఎంత ఎక్కువ పెడితే.. అంత ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది.

ఈ బాండ్లు ఎలా కొనాలి..?

RBI Retail Direct Portal ద్వారా నేరుగా ఖాతా తెరిచి కొనుగోలు చేయవచ్చు. దీనికి ప్రత్యేక ఛార్జీలు ఉండవు. అయితే.. ఈ బాండ్లలో పెట్టిన డబ్బును 7 సంవత్సరాల వరకు తీసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి.. ఎమర్జెన్సీ అవసరాల కోసం వాడుకునే డబ్బును ఇందులో పెట్టకూడదు. కేవలం లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి మాత్రమే ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే.. మీరు మీ డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, మండి వడ్డీ కావాలన్నా ఈ బాండ్స్ లో పెట్టుకోవడం బెస్ట్. అయితే మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా, FDలు, మ్యూచువల్ ఫండ్లు, RBI బాండ్లు వంటి వాటిలో విభజించి పెట్టుబడి పెట్టడం మరింత సమంజసం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Nandini Reddy: డైరెక్టర్ నందినీ రెడ్డిని ఏడిపించిన కృష్ణ వంశీ.. రమ్యకృష్ణ ఏం చేసిందంటే..
Recommended image2
Samantha: కాస్త ఆలస్యమైనా.. నిజమైన సమంత కల.. గతంలో ఏమని చెప్పిందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved