చిట్టీల్లో డబ్బులు పెట్టే బదులు ఇలా ఇన్వెస్ట్ చేస్తే..రెండేళ్లలో లక్షల డబ్బు మీ సొంతం..ఎలాగంటే..?
చిట్ ఫండ్స్ లో డబ్బులు పెట్టడం అనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం. . గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ వ్యవస్థ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా అనధికారిక వ్యవహారాలుగా కొనసాగే ఈ వ్యవస్థలో, రిస్క్ చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో చిట్ ఫండ్స్ లో డబ్బులకు బదులుగా ప్రత్యామ్నాయ వ్యవస్థలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే అంతకన్నా ఎక్కువ డబ్బు పొందవచ్చు ఎలాగో తెలుసుకుందాం.
మనలో చాలామంది చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యాపారం. కానీ చీటీ పాట అనేది గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు వ్యాపించి నటువంటి ఒక ఫైనాన్షియల్ వ్యవస్థ. పెద్ద పెద్ద సంస్థలు కూడా చిట్ ఫండ్ సంస్థలను నడుపుతూ ఉంటాయి. ఇక అనధికారికంగా చీటీ పాటలను నిర్వహించే గ్రూపులు చాలా ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల, బంధువులు, ఆఫీసుల్లో కూడా చీటీ పాటలను పాడుతూ ఉంటారు. అయితే నిజానికి ఇందులో నమ్మకం ఒకటే పెట్టుబడి. కానీ ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం.
చీటీ పాట బదులుగా మీరు ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లయితే, చీటీ పాటలో సంపాదించే డబ్బు కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ప్రతినెలా మీరు కొంత మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లయితే పెద్ద మొత్తంలో మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్స్ ఇందుకు ఒక చక్కటి మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు కచ్చితంగా డబ్బులు రిటర్న్ పొందవచ్చు. భారత స్టాక్ మార్కెట్లలో మీ డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటర్న్ పొందుతారు. నిజానికి మీరు స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టినట్లయితే రిస్క్ తో కూడిన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే తక్కువ రిస్క్ తో పాటు ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంది.
ఉదాహరణకు మీరు 2 లక్షల రూపాయల చీటీ పాటలో ప్రతినెల పదివేల రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్లయితే రెండు సంవత్సరాల తర్వాత సుమారు రెండు లక్షల పైన కొంత మొత్తం లభించే అవకాశం ఉంది. మీరు చీటీ పాట మధ్యలోనే డబ్బులు తీసుకున్నట్లయితే మీ పెట్టుబడి కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతినెల పదివేల రూపాయలను ఇన్వెస్ట్ చేసినట్లయితే. దీనినే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) అంటారు. సిప్ పద్ధతిలో రెండు సంవత్సరాల పాటు ప్రతినెల పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 2,72,432 రూపాయలు పొందే అవకాశం ఉంది.
అయితే ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రెండు లక్షల 40 వేల రూపాయలు కాగా మీకు రిటర్న్ లభించింది 32,432 రూపాయలు కావడం విశేషం. ఏ లెక్కన చూసినా మీరు చీటీ పాట కన్నా కూడా మీరు ఎక్కువ డబ్బే పోగు చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్క్ తో ముడిపడి ఉంటాయి కానీ సెక్యూరిటీ మార్కెట్లను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెబి నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది కావున అవకతవకలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.