- Home
- Business
- Business Ideas: వచ్చిన జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదా, సాయంత్రం 2 గంటలు ఈ పని చేస్తే నెలకు 50 వేలు మీ సొంతం
Business Ideas: వచ్చిన జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదా, సాయంత్రం 2 గంటలు ఈ పని చేస్తే నెలకు 50 వేలు మీ సొంతం
ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల నుంచి బయట పడాలంటే ఉద్యోగం మాత్రం చేస్తే సరిపోదు అదనపు ఆదాయం కోసం పార్ట్ టైం వ్యాపారాలు కూడా చేస్తే మీకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుంది అలాంటి వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడుతుంది. పార్ట్ టైం వ్యాపారం అనగానే, రోజుకు రెండు మూడు గంటలు మాత్రం చేస్తే సరిపోతుంది అనుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

ప్రస్తుత ఆన్లైన్ యుగంలో, అనేక వ్యాపారాలు ఇంట్లో కూర్చుని చేసుకునే వీలు కలుగుతుంది. తద్వారా రోజుకు రెండు మూడు గంటలు కష్టపడితే చాలు వేలల్లో ఆదాయం సంపాదించే వీలుంది. అలాంటి వ్యాపారాల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఆన్లైన్లో పలు వెబ్ సైట్స్ డేటా ఎంట్రీ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ డేటా ఎంట్రీ జాబ్స్ కోసం మీరు పలు వెబ్సైట్లలో ని ఓపెనింగ్స్ ఫాలో కావచ్చు. తద్వారా డేటా ఎంట్రీ పని చేసి మీరు ఖాళీ సమయంలో చేసి చక్కటి ఆదాయం పొందే వీలుంది.
రియల్ ఎస్టేట్ బిజినెస్: రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ విభాగానికి చాలా డిమాండ్ ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో పార్ట్ టైం ద్వారా కూడా డబ్బు సంపాదించుకునే వీలుంది. మీకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, క్లైంట్ లతో సంబంధాలు ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంటర్ కావచ్చు. తద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, విల్లాస్, ఫారం ల్యాండ్స్ వంటివి విక్రయించాల్సి ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారడం ద్వారా, మీ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించుకునే వీలుంది.
ఔషధ మొక్కలను అమ్మడం ద్వారా కూడా చక్కటి ఆదాయం పొందే వీలుంది ఇందుకోసం మీరు ఒక నర్సరీ ఏర్పాటు చేసుకొని, ప్రతి రోజూ కొద్ది గంటల సేపు, నర్సరీ మెయింటెనెన్స్ చేస్తే చాలు, మొక్కలను కొనేందుకు పెద్ద ఎత్తున కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. తద్వారా కూడా మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
వాస్తు, జ్యోతిష్యం కన్సల్టెంట్: ప్రస్తుత కాలంలో ప్రజలు వాస్తు జ్యోతిష్యం పట్ల ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వాస్తు జ్యోతిష్యం కన్సల్టెంట్ లకు డిమాండ్ పెరిగింది. మీరు కూడా వాస్తు జ్యోతిష్యం కన్సల్టెంట్ అవ్వాలంటే. కొన్ని డిప్లమా కోర్సులు చేస్తే సరిపోతుంది. జ్యోతిష్యం, వాస్తు కోర్సులు అందించేందుకు డీమ్డ్ యూనివర్సిటీలు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా మీరు వాస్తు జ్యోతిష్యం కన్సల్టెంట్ గా మారే వీలుంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ : మీకు మీకు చైనీస్, ఇటాలియన్ వంటలు వస్తే ఫుడ్ కోర్టు ఓపెన్ చేసి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రజలు ఇలాంటి తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. అయితే రుచి, నాణ్యత మాత్రం మెయిన్టెయిన్ చేయాల్సి ఉంటుంది.