ఆటో ఎక్స్‌పో 2025లో Creta Electric హైలైట్‌గా నిలుస్తుంది: ఫీచర్లు అలా ఉన్నాయి మరి
ఆటో ఎక్స్‌పో 2025లో ఎలక్ట్రిక్ వాహనాల సందడి హైలైట్ గా నిలిచేలా ఉంది. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఈ వేడుకలో ప్రతి కంపెనీ తమ బ్రాండ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హ్యుందాయ్ కూడా ఒకటి. తన తొలి మాస్ EV కారు క్రెటా ఎలక్ట్రిక్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించనుంది. క్రెటా ఎలక్ట్రిక్‌తో పాటు హ్యుందాయ్ తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుండి స్టారియా MPV, అయోనిక్ 9 ఎలక్ట్రిక్ SUVలను కూడా ప్రదర్శిస్తుంది. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు చూద్దాం రండి.
హ్యుందాయ్ కంపెనీ తన క్రెటా ఎలక్ట్రిక్‌తో ఆటో ఎక్స్‌పో 2025లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. క్రెటా పెట్రో వెర్షన్ భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. అందుకే దీనికి ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ తీసుకొస్తోంది. ఈ కారు ఆటో ఎక్స్‌పో 2025లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ కారు ధర మొదటి రోజు వెల్లడిస్తారట.
క్రెటా ఎలక్ట్రిక్‌తో పాటు ఇదే ఈవెంట్‌లో హ్యుందాయ్ స్టారియా MPV, అయోనిక్ 9 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVలను కూడా ప్రదర్శించనుంది.
1. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్
మహీంద్రా BE 6, మారుతి e విటారాతో పోటీ పడేందుకు క్రెటా ఎలక్ట్రిక్ EV ని తీసుకొస్తోంది. క్రెటా బేసిక్ డిజైన్ లో కొన్ని మార్పులు చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకొస్తున్నారు. అందుకే ఇది దాదాపు అదే పరిమాణం, ఆకారాన్ని కలిగి ఉంటుంది.
ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఫ్రంట్ బంపర్‌పై యాక్టివ్ ఏరో ఫ్లాప్‌లు ఏర్పాటు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ మినహా ఇంటీరియర్ లో కూడా చిన్న మార్పులు చేశారు. ARAI ప్రకారం క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్‌లు కలిగి ఉంది. ఇది 42 kWh, 51.4 kWh బ్యాటరీలను కలిగి ఉంది. ఇవి వరసగా 390, 473 కిలోమీటర్ల వరకు దూసుకుపోతాయి.
2. హ్యుందాయ్ అయోనిక్ 9 ఎలక్ట్రిక్ SUV
హ్యుందాయ్ తయారు చేసిన తాజా ప్రపంచ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయోనిక్ 9 ఎలక్ట్రిక్ SUV. గత సంవత్సరం చివరిలో LA ఆటో షోలో ఈ కారును ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ కారు కూడా ప్రదర్శనలో ఉంటుంది.
ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న SUV మోడల్ అయోనిక్ 9. ఈ కారులో ఆరు లేదా ఏడు సీట్లు ఉంటాయి. అయోనిక్ 9 కారు 110.3 kWh (గ్రాస్) బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. ఇది ఒకే ఛార్జ్‌లో 620 కి.మీ వరకు పరుగెడుతుంది. ఇందులో రెండు వెర్షన్‌లు ఉన్నాయి. అవి లాంగ్-రేంజ్, పెర్ఫార్మెన్స్.
3. హ్యుందాయ్ స్టారియా MPV
2021 నుండి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న స్టారియా MPV కారును హ్యుందాయ్ ఈ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. దీని డిజైన్ సాధారణ పీపుల్ మూవర్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో పెద్ద గ్లాస్‌హౌస్, తక్కువ బెల్ట్‌లైన్, పిక్సెల్ కాంపోనెంట్ లు ప్రత్యేకం. రెండవ వరుసలో కెప్టెన్ కుర్చీల కోసం లాంజ్ లాంటి సీట్లతో "రిలాక్సేషన్ మోడ్"ని కలిగి ఉన్న స్టారియా బెస్ట్ ఇంటీరియర్ ని కలిగి ఉంది. స్టారియాలో షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ, గ్యాసోలిన్, డీజిల్ ఇంజిన్‌లు, ఆల్-వీల్ డ్రైవ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
అయితే అయోనిక్ 9, స్టారియా MPV లను భారతదేశంలో ప్రవేశపెట్టే ప్రణాళికలు హ్యుందాయ్ కు ప్రస్తుతానికి లేవు. భవిష్యత్తులో రావడానికి అవకాశాలున్నాయి.