మరోసారి భారతదేశ అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ.. ప్రపంచ ధనవంతుడిగ టెస్లా సి‌ఈ‌ఓ..

First Published Mar 2, 2021, 4:05 PM IST

కరోనా వైరస్   వల్ల  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  తీవ్రంగా ప్రభావితమైన సంగతి మీకు తెలిసిందే. కానీ ఈ కాలంలో ప్రపంచంలోని చాలా మంది బిలియనీర్లకు కరోన కలిసొచ్చింది. 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021' ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ,  ప్రపంచంలో 8వ ధనవంతుడిగ నిలిచాడు.  ఒక నివేదిక ప్రకారం ముకేష్ అంబానీ సంపద ఈ కాలంలో  24 శాతం పెరిగింది. ముకేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ 83 బిలియన్ డాలర్లు.