MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • Stock Market: నష్టాల్లో ఉన్న పోర్ట్‌ఫోలియోను ఎలా రికవరీ చేసుకోవాలి.? ఇది మీకోసమే చూసేయండి..

Stock Market: నష్టాల్లో ఉన్న పోర్ట్‌ఫోలియోను ఎలా రికవరీ చేసుకోవాలి.? ఇది మీకోసమే చూసేయండి..

Stock Market: స్టాక్ మార్కెట్ ఇండెక్స్ పరుగులు పెడుతుంటే, మన పోర్ట్‌ఫోలియో మాత్రం ఎర్రగానే ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్న చాలా మంది ఇన్వెస్టర్లను వేధిస్తుంటుంది. మొన్న మార్కెట్ బాగా పడిపోయినప్పుడు భయపడ్డాం.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 30 2026, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్కెట్ ఇండెక్స్ vs మీ పోర్ట్‌ఫోలియో
Image Credit : Stock Market\Twitter

మార్కెట్ ఇండెక్స్ vs మీ పోర్ట్‌ఫోలియో

నిఫ్టీ పెరిగినంత మాత్రాన ప్రతి స్టాక్ పెరగాలని లేదు. ఇండెక్స్ గ్రీన్ లో ఉన్నా, మీ పోర్ట్ఫోలియో రెడ్ లో ఉండటానికి కారణం మీరు ఎంచుకున్న స్టాక్స్ కి ఇండెక్స్ తో సంబంధం లేకపోవడం. ఇండెక్స్ లో వెయిటేజ్ ఉన్న కంపెనీలు పెరిగినప్పుడు అది పైకి వెళ్తుంది. కానీ మీరు గ్రోత్ లేని లేదా ల్యాగర్డ్ స్టాక్స్ లో ఉంటే మీ పోర్ట్‌ఫోలియో కదలదు. అందుకే మార్కెట్ ట్రెండ్ ని బట్టి మీ స్టాక్స్ ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెవెన్యూ గ్రోత్ ప్రాముఖ్యత
Image Credit : Getty

రెవెన్యూ గ్రోత్ ప్రాముఖ్యత

ఏ కంపెనీ స్టాక్ అయినా పెరగాలంటే దానికి ఇంధనం 'రెవెన్యూ గ్రోత్'. ఏటా కనీసం 20-30 శాతం ఆదాయం పెరిగే కంపెనీలు మాత్రమే ఇన్వెస్టర్లకి మంచి లాభాలు ఇస్తాయి. పాత కంపెనీలు లేదా మెచ్యూరిటీ వచ్చిన కంపెనీల గ్రోత్ సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే సంపద సృష్టించడం కష్టం. యువ, వేగంగా అభివృద్ధి చెందుతున్న సెక్టార్లను(ఉదాహరణకు పవర్ సెక్టార్) గుర్తించి పెట్టుబడి పెడితే, మార్కెట్ కంటే వేగంగా మీ పోర్ట్‌ఫోలియో పెరుగుతుంది.

Related Articles

Related image1
Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎవరూ చెప్పని 8 నిజాలు ఇవే.. ఓసారి లుక్కేయండి
Related image2
Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..
35
ఓవర్ డైవర్సిఫికేషన్ - ఒక శాపం
Image Credit : Asianet News

ఓవర్ డైవర్సిఫికేషన్ - ఒక శాపం

రిస్క్ తగ్గించుకోవాలని 50-60 స్టాక్స్ కొనడం వల్ల లాభాలు డైల్యూట్ అయిపోతాయి. ఒక విన్నర్ ఉన్నా, మిగతా లాస్ లో ఉన్న స్టాక్స్ దాన్ని లాగేస్తాయి. అందుకే ఒక 10-15 క్వాలిటీ స్టాక్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాడే వారు కూడా నాలుగు రకాల ఫండ్స్ తీసుకుంటే, వాటిలో ఉండే స్టాక్స్ దాదాపు ఒకటే అయి ఉండవచ్చు. దీనివల్ల మీరు రిస్క్ తగ్గించట్లేదు, కేవలం గందరగోళం పెంచుకుంటున్నారు. మీ పోర్ట్‌ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో స్పష్టత కలిగి ఉండటం చాలా ముఖ్యం.

45
టైమింగ్ vs టైం ఇన్ మార్కెట్
Image Credit : AI

టైమింగ్ vs టైం ఇన్ మార్కెట్

మార్కెట్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అని టైమింగ్ కోసం ఎదురుచూడటం కంటే, మార్కెట్‌లో ఎంత ఎక్కువ కాలం ఉంటారు అనేది ముఖ్యం. పరిశోధనల ప్రకారం, 35 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి, మార్కెట్ బాటంలో ఇన్వెస్ట్ చేసిన అదృష్టవంతుడికి మధ్య కేవలం 2 శాతం మాత్రమే తేడా ఉంటుంది. అంటే, ఎక్కువ కాలం మార్కెట్ లో ఉండటం వల్ల ఒడిదుడుకులు సర్దుబాటు అయ్యి మంచి రిటర్న్స్ వస్తాయి. కొత్తగా వచ్చే వాళ్ళు మార్కెట్ హై లో ఉందని భయపడకుండా చిన్నగా స్టార్ట్ చేయాలి.

55
 సేఫెస్ట్ రూట్ - మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్
Image Credit : Stock Market\Twitter

సేఫెస్ట్ రూట్ - మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్

మీకు స్టాక్ మార్కెట్ లోని చిక్కుముడులు అర్థం కాకపోతే, నేరుగా స్టాక్స్ జోలికి వెళ్ళడం కంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్ ల ద్వారా రావడం ఉత్తమం. ఇది అతి సులభమైన, సురక్షితమైన మార్గం. నిపుణుల ద్వారా మీ పోర్ట్‌ఫోలియో మేనేజ్అవుతుంది కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది. మీ ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి రిస్క్ డైవర్సిఫై చేసుకుంటే, దీర్ఘకాలంలో మీ ఆర్థిక కలలను సాకారం చేసుకోవచ్చు. సంపాదన కంటే సంపద నిర్వహణే ముఖ్యం అన్నది మర్చిపోవద్దు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Recommended image2
Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Recommended image3
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Related Stories
Recommended image1
Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎవరూ చెప్పని 8 నిజాలు ఇవే.. ఓసారి లుక్కేయండి
Recommended image2
Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved