MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఈజీగా రూ.వేలు సంపాదించడం ఎలాగో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఈజీగా రూ.వేలు సంపాదించడం ఎలాగో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు చాలా మందికి మంచి ఇన్‌కమ్ అందిస్తున్నాయి. రీల్స్ షేర్ చేయడం ద్వారా యాడ్స్, మార్కెటింగ్, బ్రాండ్ పార్ట్‌నర్స్ గా మారడం, ఫేస్‌బుక్ ద్వారా ప్రకటనలు ప్రచారం చేస్తే మీరు చక్కటి ఆదాయాన్ని పొందుతారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చు? ఎంత సంపాదించవచ్చు లాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.     

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 19 2024, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కేవలం ఫోటోలను షేర్ చేసుకునే వేదికగా మాత్రమే ఉండేది. ఈ ఫోటో-షేరింగ్ యాప్ ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరుగా మారింది. మీకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 1 లక్షకు పైగా వీక్షకులు(వ్యూవర్స్) ఉంటే మీరు సుమారుగా 60 వేలకు పైగా డబ్బు సంపాదించవచ్చు. కంపెనీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం ద్వారా మరింత ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మీరు రీల్స్ సహాయంతో మీ సొంత వ్యాపారాన్ని, ప్రోడక్ట్ ని ప్రోత్సహించవచ్చు. లేదా ఇతరుల వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే మీరు యాడ్ లింక్‌లను అందించడం ద్వారా కూడా సంపాదించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు పోస్ట్ చేసే వీడియో ఆలోచనలో పాటు వీడియో డిస్క్రిప్షన్ లో కంపెనీ ప్రోడక్ట్ లింక్‌ను అందించండి. ఎవరైనా దాని ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తే మీకు కమీషన్ వస్తుంది. ఇలా మీరు మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది. 

ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్లు పలు కంపెనీల బ్రాండ్‌లతో టై అప్ అవుతారు. మీరు రీల్స్ ద్వారా బ్రాండ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

35

ఇవే కాకుండా మీరు Facebook ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. ఇది రీల్స్‌ మధ్యలో ప్రకటనలను చేర్చే అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఆ ప్రకటనల నుండి డబ్బు పొందవచ్చు. అయితే కొన్ని షరతులను తప్పక పాటించాలి. సమాజాన్ని తప్పుదారి పట్టించే వీడియోలు, నేరాల గురించి చెప్పే వీడియోలు చేసినప్పుడు రూల్స్ పాటించకపోవడం లాంటి తప్పులు చేస్తే మీ ఫేస్ బుక్ అకౌంట్ డౌన్ చేస్తారు. బ్లాక్ చేస్తారు. ఇలా జరిగితే మీకు యాడ్ రెవెన్యూ రాదు. అందువల్ల షరతులు పాటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. 

45

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రకాలు

20k-50k ఫాలోవర్లు - మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు

60k-160k ఫాలోవర్లు - మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు

300k-500k ఫాలోవర్లు - మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లు

700k-1.5m ఫాలోవర్లు - సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు.

55

ఇన్‌ఫ్లుయెన్సర్ నెలవారీ ఆదాయం

ఒక నివేదిక ప్రకారం నానో-ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ.20k - రూ.30k సంపాదిస్తారు. అదేవిధంగా మైక్రో - ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ. 30k - రూ. 60k, మాక్రో - ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ. 60k - రూ. 68k వరకు సంపాదిస్తారు. మెగా/సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు అయితే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు.

అయితే ఈ ఆదాయం ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఈ ఆదాయం గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తం మీద చాలా మంది సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ద్వారా వేల రూపాయలు సంపాదిస్తున్నారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(11.3 ov)123/4
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
LPG Cylinder Prices: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. వరుసగా మూడో నెల పెరిగిన ధరలు
Recommended image2
Top Indian Companies: భారత టాప్-10 కంపెనీల్లో ముకేష్ అంబానీ జోరు.. పూర్తి లిస్టు ఇదే
Recommended image3
SIP Vs PPF: ప్రతినెలా రూ. 3 వేలు దాస్తే రూ. 14 లక్షలా? పీపీఎఫ్ vs ఎస్ఐపీ సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved