- Home
- Business
- Sim Card: మీ ఆధార్ పై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్ ఉన్నాయో? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా..
Sim Card: మీ ఆధార్ పై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్ ఉన్నాయో? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా..
Sim Card: రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న దృష్ట్యా మీ ఆధార్ పై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ప్రభుత్వ వెబ్‌సైట్ tafcop.dgtelecom.gov.in ని సందర్శించి, మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్‌లు లింక్ చేయబడ్డాయో తెలుసుకోవచ్చు.

మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా?
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీ వ్యక్తిగత వివరాలు ఎవరి చేతుల్లోనూ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో స్కామర్లు లేదా సైబర్ మోసగాళ్లు ఇతరుల గుర్తింపులను వాడుకుని, కొత్త సిమ్ కార్డులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు తీసుకున్నారో తెలుసుకోకుండా ఉండటం ప్రమాదకరం. మీ ఐడీతో యాక్టివేట్ చేయబడిన సిమ్‌ల వివరాలు, వాటిని ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ మోసాలకు బ్రేక్ – TAFCOPతో ట్రాక్
మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు యాక్టివ్ లో ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా సులభం. కొన్ని స్టెప్పులు అనుసరిస్తే, మీ పేరు మీద నమోదైన అన్ని మొబైల్ నంబర్లు ఏవో మీరు గుర్తించవచ్చు. ఆన్లైన్ మోసాలు, స్కామ్‌లు, ఫ్రాడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ టెలికం శాఖ ద్వారా సూచించిన అధికారిక వెబ్సైట్ tafcop.dgtelecom.gov.in. (TAFCOP - Telecom Analytics for Fraud Management and Consumer Protection)పోర్టల్ ద్వారా ఆ సమాచారం చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఎన్ని సిమ్‌లు యాక్టివేట్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి ?
దశ 1 - ముందుగా మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ tafcop.dgtelecom.gov.inకి వెళ్లాలి.
దశ 2 - ఇక్కడ మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, “Request OTP” క్లిక్ చేయండి.
దశ 3 - మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTPపై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.
దశ 4 - లాగిన్ అయిన తర్వాత, తదుపరి పేజీలో మీ IDతో యాక్టివ్ అయిన అన్ని మొబైల్ నంబర్ల జాబితా కనిపిస్తుంది. ఈ జాబితాలో మీకు తెలియని నంబర్లు ఉన్నాయా? అవి మీకు సంబంధించినవి కావా? అయితే వాటిని “Report” చేయవచ్చు.
అనవసర నంబర్ బ్లాక్ చేయడం ఎలా?
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. అదే ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన అన్ని నంబర్ల జాబితాను TAFCOP వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. ఈ జాబితాలో మీరు ఉపయోగించని నంబర్ ఉంటే లేదా మీరు ఉపయోగించని నంబర్లు కనిపిస్తే మీరు వాటిని నివేదించి (Report) బ్లాక్ చేయవచ్చు. "This is not my number" లేదా "Not Required" అనే ఆప్షన్ ఎంచుకుని Submit చేయండి. నివేదిక సమర్పించిన మీకు రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు. ఆ నెంబర్ ను భవిష్యత్తులో ట్రాక్ చేసేందుకు సేవ్ చేసుకోండి.
ఒక ఆధార్ తో ఎన్ని సిమ్ లు తీసుకోవచ్చు ?
భారతదేశంలో ఒక ఆధార్ తో 9 SIMలను యాక్టివేట్ చేయవచ్చు. అయితే, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఒక ఆధార్ తో 6 SIMలను యాక్టివేట్ చేయవచ్చని భారత ప్రభుత్వ టెలికం శాఖ వెల్లడించింది. మీ ఆధార్ పై ఎన్ని SIMలు యాక్టివ్‌గా ఉన్నాయో మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అప్రమతంగా ఉండండి.