బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే మొబైల్ నెంబర్ అప్‌డేట్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసా?
ప్రస్తుతం దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వారికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన సేవల గురించి తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు..
ప్రభుత్వ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మొబైల్ ఫోన్ వినియోగం కూడా పెరగడంతో బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ లింకింగ్ కూడా అనివార్యంగా మారింది.
ఖాతాల్లో డబ్బులు పడినా, విత్‌డ్రా చేసినా వెంటనే మెసేజ్‌ల రూపంలో అలర్ట్స్ వస్తున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్‌కు ఫోన్ నెంబర్‌ను మార్చుకోవాల్సి వస్తే సాధారణంగా బ్యాంకుకు వెళ్తుంటాం.
అయితే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండా. ఇంట్లోనే ఉండి మీ ఫోన్ నెంబర్‌ను మార్చుకోవచ్చే విషయం మీకు తెలుసా.? ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇందుకోసం ప్రజలకు సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో ఖాతాదారులు గడప కూడా దాటకుండానే ఎంచక్కా ఫోన్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. ఇందుకోసం రెండు రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాగా, మరొకటి ఏటీఎమ్ ద్వారా. ఈ ప్రాసెస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా..
ఇంటర్నెట్ బ్యాంకింగ్..
ఇందుకోసం ముందుగా ఖాతాదారులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే ఓ పేజ్ అవుతుంది. అందులో కనిపించే 'ఛేంజ్ మొైల్ నెంబర్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు మార్చాలనుకుంటున్న ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. కొద్ది సేపటికి మీ నెంబర్ మారినట్లు మెసేజ్ రూపంలో అలర్ట్ వస్తుంది.
ఏటీఎమ్ ద్వారా కూడా..
ఏటీఎమ్ ద్వారా కూడా..
మనం డబ్బు విత్‌డ్రా కోసం ఉపయోగించే ఏటీఎమ్ ద్వారా కూడా మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోచ్చు. ఇందుకోసం ముందుగా మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లాలి. ఏటీఎమ్ ఇన్‌సెర్ట్ చేసి పిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తర్వాత అక్కడ కనిపించే మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ముందుగా మీ పాత మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత కొత్త నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ సమయంలో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా సింపుల్ స్టెప్స్‌తో బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు.