Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి?
Gold Rate Today: మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. చెన్నైలో ఒక సవరన్ ఆభరణాల బంగారం రూ.800 తగ్గి రూ.90,000కి, ఒక గ్రాము వెండి రూ.165కి అమ్ముడవుతోంది. ధరల తగ్గుదల గృహిణులకు ఊరటనిచ్చింది.

బంగారం ధరలు ఇవిగో
బంగారం ధరలు రోజు రోజుకి మారిపోతున్నాయి. వారం రోజులుగా పెద్దగా తేడా లేని బంగార ధరల్లో మంగళవారం మాత్రం కొంచెం మార్పు కనిపించాయి. మంగళవారం బంగారం, వెండి ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత కొన్ని రోజులుగా జెట్ స్పీడ్‌తో పెరిగిన ధరలు నేడు అకస్మాత్తుగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా రావడంతో బంగారం అమ్మకాలు సాగాయి.
ధరలలో మార్పులు
చెన్నైలో ఈరోజు ఒక గ్రాము ఆభరణాల బంగారం మీద ధర రూ.100 తగ్గి రూ.11,250గా ఆగింది. దీంతో పాటు ఒక సవర బంగారం ధర రూ.800 తగ్గి రూ.90,000కి అమ్ముడవుతోంది. గత కొన్ని వారాలుగా ధరలు నిరంతరం పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, ప్రత్యేక కార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేయడం తగ్గించారు. నేడు బంగారం ధరలు తగ్గడం వల్ల మళ్లీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
అదేవిధంగా, ఈరోజు వెండి ధర కూడా తగ్గింది. ఒక గ్రాము వెండి ధర రూ.3 తగ్గి ప్రస్తుతం రూ.165 దగ్గర ఆగింది. అదే సమయంలో, ఒక కిలో వెండి రూ.1,65,000కి అమ్ముడవుతోంది.
బంగారం, వెండి ధరలలో ఈ తగ్గుదల వల్ల ళ్లిళ్ల సీజన్‌లో నగల దుకాణాలు కిటకిటలాగే అవకాశం ఉంది. ధరలు తగ్గినప్పుడే ఎంతో మంది బంగారం కొనడానికి మంచి అవకాశంగా భావిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారు ధర గ్రాము 12,246 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 71 రూపాయలు తగ్గింది. పది గ్రాముల బంగారం ధర 1,22,460 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 568 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 11,225 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 65 రూపాయలు తగ్గింది. పదిగ్రాముల బంగారం ధర 1,12,250 రూపాయలుగా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే 650 రూపాయలు తగ్గింది. బంగారం ఈ మాత్రం తగ్గడం కూడా గొప్పే అని చెప్పాలి.