Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారు, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
Gold Rate Today: వారంలో మొదటి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తాయి. ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఇచ్చాము. సెంట్రల్ బ్యాంకుల పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ పతనం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కారణంగా గోల్డ్ రేట్లు మారుతున్నాయి.

గోల్డ్ రేట్ లో మార్పులు
బంగారు ధరలు ఎంతో మంది జీవితాలను మార్చేస్తాయి. సోమవారం అంటే నవంబర్ 3న బంగారం ధర కాస్త పెరిగింది. అలాగే వెండి ధర కూడా పెరగింది. దీంతో నగల దుకాణాలు ఖాళీగా కనిపిస్తాయి. చెన్నైలో ఆభరణాల బంగారం ఒక గ్రాముకు రూ.40 పెరిగింది. అలా ఈ రోజు చెన్నైలో గ్రాము బంగారం ధర రూ.11,350కి చేరింది.
బంగారం ఎందుకు పెరుగుతుంది?
స్టాక్ మార్కెట్ పరిస్థితి అనేది బంగారపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. స్టాక్ మార్కెట్ పతనమైనా కూడా బంగారం రేటు పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే దీనివల్ల బంగారం డిమాండ్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ బాగా నడిస్తే, బంగారంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. అప్పుడు ధరలు కూడా తగ్గుతాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతాయి.
భారతదేశంలో బంగారం అనేది ఒక సాంప్రదాయ పెట్టుబడిగా భావిస్తారు. పెళ్లిళ్ల సీజన్, పండుగలు, దీపావళి, ఆషాడ మాసం వంటి సమయాల్లో బంగారం కచ్చితంగా పెరుగుతుంది. దీనివల్ల కూడా ధరలు పెరుగుతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లేదా ఇతర సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తుండడంతో , మార్కెట్లో బంగారం కొరత ఏర్పడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారు ధరలు గ్రాముకు రూ.12, 317 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మంలో కూడ ఇదే ధరలు ఉన్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము వెండి 168 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,68,000 రూపాయలుగా ఉంది. అంటే రెండు వేల రూపాయలు ధర పెరిగింది.