MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • హోండా ఆక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి: బుకింగ్ ఇలా చేసుకోండి

హోండా ఆక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి: బుకింగ్ ఇలా చేసుకోండి

హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ స్కూటర్ల బుకింగ్స్ ప్రస్తుతం ఓపెన్ అయ్యాయి. ఈ స్కూటర్ డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ల ఫీచర్లు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 01 2025, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహనాల సేల్స్ పెంచేలా అనేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పుడు హోండా కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రెండు మోడల్స్ బుకింగ్స్ ఓపెన్ చేశాయి. మీరు గాని హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొనే ఆలోచనలో ఉంటే వెంటనే బుకింగ్ చేసుకోండి. 

25

హోండా కంపెనీ ఆక్టివా ఇ, క్యూసి 1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ మోడల్స్ ప్రస్తుతం ప్రధాన నగరాల్లోని డీలర్షిప్ లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆక్టివా ఇ ఢిల్లీ, ముంబై, బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. QC1 ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్ లలో బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ రెండు మోడల్స్ లో మీరు ఏది బుక్ చేయాలనుకున్నా రూ.1,000 కడితే సరిపోతుంది. అయితే త్ఆవరతలో జరుగనున్న ఆటో ఎక్స్‌పోలో ధరలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 2025 లో డెలివరీలు ప్రారంభమవుతాయని హోండా ప్రకటించింది.

35

హోండా ఆక్టివా ఇ మోడల్ లో రిమూవబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. ఈ స్కూటర్లు ఐదు రంగుల్లో లభిస్తాయి. ఈ స్కూటర్లలో 7.0 అంగుళాల TFT డిస్ప్లే ఉంది. Honda RoadSync Duo యాప్ తో వస్తుంది. ఆక్టివా ఇ హోండా మొబైల్ పవర్ ప్యాక్ తో వస్తుంది. ఇందులో రెండు 1.5 kWh బ్యాటరీలు ఉన్నాయి. అందువల్ల ఈ స్కూటర్లు 102 కి.మీ. రేంజ్ వరకు ఆగకుండా పరుగులు తీస్తాయి. 

45

హోండా QC1 మోడల్ విషయానికొస్తే ఈ స్కూటర్ అధునాతన సాంకేతికతతో వస్తోంది. ఆక్టివా ఇ లాగానే ఇది ఐదు రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ లో 1.5 kWh బ్యాటరీ మాత్రమే ఉంది. అందుకే ఇది 80 కి.మీ. రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 4 గంటల 30 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.

55

ఆక్టివా ఇ లాంచ్ అప్డేట్స్

ఈ స్కూటర్ 1.8 kW మోటార్ తో, 77 Nm టార్క్ తో 50 km/h వేగంతో వెళ్తుంది. 5.0 అంగుళాల LCD డిస్ప్లే, USB టైప్-C అవుట్‌లెట్, 26 లీటర్ స్టోరేజ్ తో వస్తుంది. 3 సంవత్సరాలకు 50,000 కి.మీ. తిరగడానికి కంపెనీ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్ మీరు కొంటే మొదటి సంవత్సరంలో మూడు ఉచిత సర్వీసులు పొందవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉచితంగా లభిస్తుంది.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved