9 టు 5 జాబ్ బోర్ కొట్టిందా? నెలకు రూ.2 లక్షలొచ్చే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి
మీకు 9 టు 5 జాబ్ బోరు కొట్టిందా? బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? రిస్క్ తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ఓ మంచి బిజినెస్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ బిజినెస్ ను మీరు ఇంటి నుండే చేయవచ్చు. దీని ద్వారా మీరు నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. డీటైల్స్ తెలుసుకుందాం రండి.
ప్రతి ఒక్కరికీ డబ్బులు చాలా ముఖ్యం. కాని ఉద్యోగం చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం. చాలా మంది 9 టు 5 జాబ్ చేస్తూ సరిపడా డబ్బులు సంపాదించలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే రిస్క్ తీసుకొని బిజినెస్ చేసి సక్సెస్ చేస్తే అవసరానికి మించి డబ్బులు సంపాదించవచ్చు.
మీరు కూడా ఇలా బిజినెస్ ఆలోచనలో ఉంటే మీకు ఈ ఐడియా నచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో రిస్క్ తక్కువ. మార్కెట్ లో ఈ ప్రొడెక్ట్ కి డిమాండ్ కూడా ఎక్కువ. ఈ బిజినెస్ మీరు ఇంట్లో ఉండి కూడా ప్రారంభించొచ్చు.
అదే స్నాక్స్ తయారీ వ్యాపారం. ప్రతి ఇంటిలోనూ స్నాక్స్ అవసరం ఉంటుంది. పిల్లలు తరచూ చిరుతిళ్లు అడుగుతుంటారు. వారికి మార్కెట్లో హానికరమైన స్నాక్స్ ప్యాకెట్లు కొనే బదులు వీటిని పెడితే ఆరోగ్యంగా కూడా ఉంటారు.
అంతేకాకుండా టీ లో ఉపయోగించే స్నాక్స్ ఐటమ్స్ కూడా మీరు తయారు చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది టీ తో పాటు బిస్కెట్స్, మురుకులు తింటారు. అందువల్ల టీ లోకి రుచికరంగా ఉండే ఉప్పు, మిరియాలు, మసాలా దినుసులతో కూడిన స్నాక్స్ తయారు చేసి విక్రయిస్తే మీరు మంచి లాభాలు పొందుతారు.
రోజూ తాగే టీ కోసమే కాకుండా వివాహాలు, పండుగలకు కూడా స్నాక్స్ తయారు చేసి ఇవ్వొచ్చు. వీటికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు 300 నుండి 500 చదరపు అడుగుల వరకు చిన్న స్థలం అవసరం. ఈ యూనిట్ కి ఓ పేరు పెట్టి అనంతరం భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)లో నమోదు చేసుకోవాలి.
FSSAI సర్టిఫికేట్ ఉండటం వల్ల మీ స్నాక్స్ ఐటమ్స్ నాణ్యత ప్రమాణాలతో తయారవుతున్నాయని వినియోగదారుల్లో నమ్మకం కలుగుతుంది. తరువాత మీరు ఏ రకమైన స్నాక్స్‌ను తయారు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని అవసరమైన పదార్థాలను సేకరించండి. వీటి కోసం అవసరమైన పరికరాలను కొనండి.
సరైన సెటప్‌తో మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా వర్క్ జరుగుతుంది. ఈ వ్యాపారంలో ప్రొడక్షన్ ఎంత ముఖ్యమో, మీ స్నాక్స్‌ను వినియోగదారులకు చేరడం అంత ముఖ్యం. దీని కోసం మీరు ప్రకటనలను ఎక్కువగా ఇవ్వాలి. స్థానికంగా ఎక్కువగా యాడ్స్ ఇవ్వండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగించి ప్రచారం చేసుకోండి.
మీ స్నాక్స్‌కు డిమాండ్ పెరిగేకొద్దీ సమీపంలోని షాప్స్ కి కూడా పంపిణీ చేయవచ్చు. ఈవెంట్‌లకు, క్యాటరింగ్ వాళ్లకు కూడా మీ స్నాక్స్ సరఫరా చేయండి. మీ స్నాక్స్ ప్రజాదరణ పొందిన తర్వాత మీరు నెలకు రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ప్రతి వస్తువుపై 20 నుండి 30 శాతం వరకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కంటిన్యూ ప్రొడక్షన్ చేయడం ద్వారా మార్కెట్ లో మీకు ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దీంతో మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది.