locking System: ఈ భూమ్మీద మొదటి తాళం, చెవి ఎవరు తయారు చేశారో తెలుసా?
locking System: ఇంటికి తాళం ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా.. కాని మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో మొట్టమొదటి తాళం ఎవరు, ఎప్పుడు కనిపెట్టారని.. తాళం, దాని చెవి వెనుక ఉన్న ఆస్తకికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.

పూర్వం ఇళ్లకు తాళాలు కూడా ఉండేవి కావు. ఎందుకంటే దొంగతనాలు ఉండేవి కావు. అందరూ గుంపులుగా జీవనం సాగించేవారు. దీంతో అందరూ ఒకే కుటుంబంగా జీవించేవారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చేవారు. దీంతో లాక్స్ అవసరం గురించి అప్పటి జనాలు ఆలోచించలేదు.
అయితే మనిషిలో ఎప్పుడైతే స్వార్థ బుద్ధి పెరిగి, పక్కోడి వస్తువులు కొట్టేయాలన్న కోరిక పుట్టిందో అప్పుడు వస్తువుల రక్షణ గురించి మనిషి ఆలోచించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాళం, చెవి ఆవిష్కరణ జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి తాళం చెవి ఎప్పుడు, ఎవరు కనిపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
తాళాల చరిత్ర
తాళాలను మొదటిసారి ఈజిప్షియన్లు తయారు చేశారని చారిత్రక గ్రంథాలలో ఉంది. క్రీ.పూ 4000లో అస్సిరియా నగరంలో తాళం, దాని చెవిని చెక్కతో తయారు చేసి ఉపయోగించారు. ఆ తరువాత ఈజిప్షియన్లే “పిన్ లాక్” అనే మరో తాళం రకాన్ని చెక్కతో తయారు చేశారు. పిన్ లాక్ తాళం చెవి ప్రస్తుతం మనం వాడుతున్న టూత్ బ్రష్ ఆకారంలో ఉండేది. తాళం లోపల ఉన్న “పిన్‌లు” విడిపోయి, లాక్ తెరుచుకునేది.
తాళాలకు అప్డేషన్ ఇచ్చిన రోమన్లు
రోమన్లు ఈ తాళాలకు కొత్త రూపాన్ని, బలాన్ని ఇచ్చారు. క్రీ.శ 1వ శతాబ్దంలో (870 - 900 BC) లోహంతో చేసిన ధృఢమైన తాళాలను తయారుచేశారు. కొన్ని వేల సంవత్సరాల తరువాత గ్రీకులు, రుమేనియన్లు ఈ “పిన్ లాక్” తాళాలకు కొత్త రూపం ఇచ్చారు.
18వ శతాబ్దంలో తాళాల అభివృద్ధి
18 శతాబ్దం ప్రారంభంలో తాళాలను కొత్త రూపాన్ని పొందాయి. 1788లో స్థూపాకారపు “పిన్ టంబ్లర్ లాక్” తయారైంది. దీన్ని ఇంగ్లాండ్ కు చెందిన రాబర్ట్ బారోన్ తయారు చేశారు. ఆ తరువాత 1784లో బ్రహ్మా తాళం పేరుతో జోసెఫ్ బ్రమ్మయ్య కొత్త తాళాలు తయారు చేశారు. 1818లో జర్మన్ దేశస్థులు సబ్ పేరుతో తాళాలు తయారు చేశారు. 1848లో పిన్ టంబ్లర్ తాళాలు, 1857లో సెల్ఫ్ లాక్ తాళాలు తయారయ్యాయి. ఆ తర్వాత 1916, 1924లో తాళాల్లో మరికొన్ని అప్డేషన్స్ వచ్చాయి.
భారతదేశంలో దిండుక్కల్ తాళాలు
భారతదేశం దిండుక్కల్ తాళాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. వివిధ రకాల జంతువుల ఆకారాల్లో ఉండే ఈ తాళాలు చెడ్డ ఆత్మల నుండి తమను తాము రక్షించుకుంటాయని అప్పట్లో నమ్మేవారు. ఆ తర్వాత లాక్ సిస్టమ్ ఎంత అప్డేట్ అయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం. లాకర్స్, చైన్ లాక్స్, సింగిల్ కీ సిస్టమ్, సెన్సార్ లాక్స్ ఇలా టెక్నాలజీ మారుతుంటే లాకింగ్ సిస్టమ్ కూడా కొత్త రూపాన్ని పొందుతోంది.