ఈ బెస్ట్ ఫీచర్స్ మీ ఫోన్ లో ఉన్నాయని మీకు కూడా తెలియదు
అందరం మొబైల్ ఫోన్లు వాడతాం. కాని మనలో చాలా మందికి వాటిలో ఉండే కొన్ని ఫీచర్స్ తెలియవు. అందరికీ అవి చాలా అవసరమైనవే అయినా ఆ ఆప్షన్స్ ఎక్కడున్నాయో ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి కనిపించకుండా దాగి ఉన్న బెస్ట్ ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితాన్ని చాలా సులభం చేసేస్తోంది. కష్టపడాల్సిన పని లేకుండానే ఫోన్ ఒకటుంటే అన్ని పనులు దాని ద్వారా చేసేంత టెక్నాలజీ వచ్చేసింది. కాలు కింద పెట్టకుండానే ఎన్నో ముఖ్యమైన పనులు చేసేయొచ్చు. కాని మన ఫోనుల్లో అన్ని ఆప్షన్స్, ఫీచర్స్ ఉన్నాయని చాలా మందికి తెలియవు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
split screen
మనలో ఎక్కువ మంది దగ్గర ఉండేవి ఆండ్రాయిడ్ మొబైల్సే కదా.. కాని వీటిల్లో split screen అనే అద్భుతమైన ఫంక్షన్ ఉందని చాలా మందికి తెలియదు. స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇది ఏకకాలంలో రెండు స్క్రీన్ లపై తెరిచి చూపిస్తుంది. ఈ రెండింటినీ మీరు ఒకేసారి ఆపరేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రతి యాప్ కు ఉంటుంది. కొన్ని యాప్స్ మాత్రం ఈ ఫీచర్ కి మద్దతివ్వవు.
మీరు స్ప్లిట్ చేయాలనుకున్న యాప్ ఓపెన్ చేసి మెనూలో "స్ప్లిట్ స్క్రీన్" ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
Secure folder
Samsung Galaxy ఫోన్లు ఉపయోగించే వారికి ఈ సెక్యూర్ ఫోల్డర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది ప్రైవేట్ ఫోటోలు, ఫైల్‌లు, యాప్‌లను దాచి ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ఫోల్డర్ చాల సెక్యూర్ గా ఉంటుంది. ఎందుకంటే దీనికి PIN, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ లాగిన్ అవసరం.
Document Scanner
మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగిస్తారు కదా.. మీరు గాని iPhone ఉపయోగిస్తున్నట్లయితే నేరుగా నోట్స్ యాప్ నుండి డాక్యుమెంట్‌లను స్కాన్ చేయొచ్చు. ఇది ప్రత్యేకంగా iPhone ఉన్న వారికే ఉపయోగపడుతుంది.
కొత్త నోట్ ఓపెన్ చేసి, కెమెరా బటన్ క్లిక్ చేసి "స్కాన్ డాక్యుమెంట్స్" ఆప్షన్ ని సెలక్ట్ చేయండి.
UI Tuner
Android మొబైల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ గురించి తెలుసుకోవడం అవసరం. UI ట్యూనర్ ఫీచర్ వల్ల మీరు ఫోన్ ను స్పీడ్ గా ఉపయోగించగలుగుతారు. ఇది ఒక ప్రత్యేక మెనూ ను క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే షార్ట్ కట్ ఆప్షన్. ఇందులో మీరు చేయాల్సిన పనులు ముందుగా షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. గడియారం, నోట్ ప్యాడ్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ని అందులో పెట్టుకొని ఉంచుకోవచ్చు.