Under Rs10000 Phones: అమెజాన్ లో రూ.10,000 కన్నా తక్కువ ధరకు వచ్చే బెస్ట్ ఫోన్లు ఇవిగో
దీపావళి సందర్భంగా అమెజాన్ ఫెస్టివ్ సేల్ నడుస్తోంది. అతి తక్కువగా పదివేల రూపాయల కంటే తక్కువ ధరలో (Under rs10000 Phones) వచ్చే ఫోన్ల జాబితా ఇక్కడ ఇచ్చాము. ఇందులో శాంసంగ్ , రెడ్‌మీ, పోకో, రియల్‌మీ వంటి ఫోన్లు ఉన్నాయి.

అమెజాన్ ఫెస్టివ్ సేల్
దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ఫెస్టివ్ సేల్ నడుస్తోంది. కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ టైమ్. అతి తక్కువ ధరకే ఫోన్లు అందుబాటులోఉన్నాయి. రూ. 10,000 లోపు బడ్జెట్‌లో 50MP కెమెరా, మంచి బ్యాటరీతో దొరికే ఫోన్ల గురించి ఇక్కడ ఇచ్చాము.
శాంసంగ్ గెలాక్సీ M05
శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ను ఈ సేల్ లో భాగంగా 6,249 రూపాయలకే కొనవచ్చు. ఇందులో 50MP డ్యూయల్ AI కెమెరా, 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 6.7-అంగుళాల HD+ స్క్రీన్ ఉన్నాయి.
రెడ్‌మీ A4
రెడ్‌మీ A4 మోడల్‌ను ఈ సేల్‌లో ₹8,999 ప్రారంభ ధరతో కొనొచ్చు. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB RAM ఉన్నాయి.
పోకో M7 5G
వేగవంతమైన 5G సపోర్ట్‌తో వచ్చే పోకో M7 5G స్మార్ట్‌ఫోన్‌ను ₹8,499 ప్రారంభ ధరకే పొందొచ్చు. ఇందులో 5,160mAh బ్యాటరీ, 6GB RAM, 128GB స్టోరేజ్, 50MP వెనుక కెమెరా ఉన్నాయి.
రియల్‌మీ C71 4G
రియల్‌మీ C71 4G మోడల్‌ను ఈ సేల్‌లో ₹7,999 ప్రారంభ ధరతో కొనొచ్చు. దీనిలో 5,000mAh బ్యాటరీ, 6GB RAM, 128GB స్టోరేజ్, 32MP వెనుక కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నాయి.
లావా బోల్డ్ N1 ప్రో
భారతీయ బ్రాండ్ లావా బోల్డ్ N1 ప్రో స్మార్ట్‌ఫోన్ ఈ సేల్‌లో ₹6,599 ధరకే అందుబాటులో ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉన్నాయి.