SBI: మహిళలకు గుడ్ న్యూస్, ఇకపై ఎస్‌బీఐలో 30 శాతం ఉద్యోగాలు అమ్మాయిలకే
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ఇది మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మహిళలకు 30 శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఇస్తున్నట్టు చెప్పింది.

ఎస్‌బీఐలో మహిళలకు ఉద్యోగాలు
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని అందుకోసం మహిళా ఉద్యోగులు సంఖ్యను పెంచాలని నిర్ణయించుకుంది. రాబోయే ఐదేళ్లలో మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళా ఉద్యోగుల కోసం
బ్యాంక్ ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో 33 శాతం మహిళలు ఉన్నా, మొత్తం ఉద్యోగులలో వారి వాటా 27 శాతం మాత్రమే ఉంది. ఈ శాతాన్ని పెంచి లింగ సమానత్వాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది.
కీలక పథకాలు
లింగ భేదాన్ని తగ్గించడానికి స్టేట్ బ్యాంక్ కొన్ని కీలక పథకాలను అమలు చేస్తోంది. పనిచేసే తల్లులకు 'క్రెచ్ అలవెన్స్', ప్రసూతి సెలవు తర్వాత తిరిగి చేరే మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
మహిళలకు ప్రత్యేకంగా
మహిళల ఆరోగ్యం కోసం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ ఉద్యోగులకు న్యూట్రిషన్ అలవెన్స్, గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్ వంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టనుంది.
మహిళా ఉద్యోగుల హవా
ఎస్‌బీఐ ప్రత్యేకంగా మహిళా శాఖల సంఖ్యను విస్తరిస్తోంది. ప్రస్తుతం 340కి పైగా శాఖలను మహిళా ఉద్యోగులే నడుపుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని బ్యాంక్ తెలిపింది.