రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ట్రైన్ ఆలస్యంగా వస్తే టికెట్ డబ్బులు వాపస్.. ఎలాగో తెలుసా?
మీరు ఎక్కువగా రైలులోప్రయాణించే వారైతే ఈ న్యూస్ తప్పకుండా మీకు ఉపయోగంగా ఉంటుంది. అదేంటంటే మీ ట్రెయిన్ ఆలస్యం అయితే మీరు మీ ట్రెయిన్ చార్జెస్ పూర్తిగా వాపసు పొందవచ్చు. అవును...నిజమే.. ఎలా అని అనుకుంటున్నారా...
దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రయాణీకులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. చాలా సార్లు కొన్ని కారణాల వల్ల రైలు ఆలస్యమై ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. రైలు ఆలస్యమైతే భారతీయ రైల్వే చార్జెస్ పూర్తి రిటర్న్ ఇస్తుంది.
అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఇండియన్ రైల్వే రూల్స్ ముందుగా ఏం చెబుతున్నాయో తెలుసువాలి. చాలా మంది రైలు ప్రయాణికులకు రిటర్న్ సౌకర్యం గురించి తెలియదు. టికెట్ ఛార్జ్ పూర్తి మొత్తాన్ని పొందడానికి, ప్రయాణీకుడు కొంచెం చెల్లించవలసి ఉంటుంది, దాని కోసం టిక్కెట్ డిపాజిట్ రిసిప్ట్ లేదా TDR ఫైల్ చేయాలి.
ప్రయాణీకులు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో లేదా టిక్కెట్ కౌంటర్‌లో TDRని బుక్ చేసుకోవచ్చు. అయితే, రీఫండ్ అందుకోవడానికి కనీసం 90 రోజులు పడుతుంది. ముందుగా IRCTC వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి లాగిన్ కావాలి. 'సర్వీసెస్' ట్యాబ్‌లో "ఫైల్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ (DTR)"ని సెలెక్ట్ చేసుకోండి.
దీని తర్వాత, మై ట్రాన్సక్షన్స్ కి వెళ్లి, "TDR ఫైల్"పై క్లిక్ చేసి, కంటిన్యూ చేయండి. మీ రిక్వెస్ట్ రైల్వేకు ఫార్వార్డ్ చేయబడుతుంది. టిక్కెట్‌ను బుక్ చేసుకున్న వ్యక్తి అదే బ్యాంక్ ఖాతాకు రీఫండ్ జమ చేయబడుతుంది.
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు ఆలస్యమైతే ప్రయాణికులు ఈ వాపసు పొందవచ్చు. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితేనే ప్రయాణికులు వాపసు పొందవచ్చు అని గుర్తుంచుకోవాలి. అయితే, కన్ఫర్మేషన్ తత్కాల్ టిక్కెట్‌ను క్యాన్సల్ చేసినట్లయితే తిరిగి చెల్లించబడదు.
సహజంగా ఒక రైలు 3 గంటలు ఆలస్యమైతే ఇంకా మీరు అందులో ప్రయాణించకూడదనుకుంటే, మీరు రిటర్న్ పొందవచ్చు. రీఫండ్ క్లెయిమ్ కోసం టికెట్ డిపాజిట్ రిసిప్ట్ అంటే TDRని ఫైల్ చేయాలి.