నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఏకంగా 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు Flipkart సిద్ధం...పండగ చేసుకోండి...
దేశీయ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ 1 లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని కంపెనీ తెలిపింది.
పండుగ సీజన్ కు ముందే ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాల వెల్లువ ఒక్క సారిగా వెల్లువెత్తనుంది. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ కార్యకలాపాల కోసం అదే విధంగా పండగ సీజన్లో వెలువలా వచ్చే డిమాండ్ ను తట్టుకునేందుకు ఒక లక్ష మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పండగ సీజన్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఈ నియామకాలను చేపట్టనుంది. ఈ ఉద్యోగాలన్నీ తాత్కాలికమే అయినప్పటికీ. పండుగ సీజన్‌లో నిరుద్యోగ యువత డబ్బులు సంపాదించుకునేందుకు సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. గతంలో కన్నా కూడా ఈసారి మరింత ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునేందుకు ఫ్లిప్కార్ట్ సిద్ధం అవుతోంది.
పండుగల సీజన్‌కు ముందు లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ సోమవారం తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రిక్రూట్‌మెంట్‌లు తమ సరఫరా చెయిన్ లో జరుగుతాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా లాస్ట్ మైలు డెలివరీ విషయంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే పెద్ద ఎత్తున ఈ రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.
ఇందులో భాగంగా స్థానిక కిరాణా సరఫరా భాగస్వాములతో పాటు, మహిళలు ప్రత్యక్ష. పరోక్ష ఉపాధిలో పాల్గొంటారు. వికలాంగులకు కూడా రిక్రూట్మెంట్లో ఉపాధి పొందనున్నారు.పండగ సీజన్‌కు ముందు తమ సరఫరా గొలుసులో లక్షకు పైగా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాలని కంపెనీ భావిస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ మాట్లాడుతూ, బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లక్షలాదిమంది కొత్త కస్టమర్‌లకు ఇ-కామర్స్ గొప్పతనాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ విక్రయ సమయంలో Flipkart అనేక పేరు ఉన్న అగ్ర బ్రాండ్‌ల ఉత్పత్తులపై తగ్గింపులను అందిస్తుంది.
హేమంత్ బద్రీ ప్రకారం, ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా, మేము ప్యాకేజింగ్, స్టోరేజ్ , పంపిణీ, ప్లేస్‌మెంట్, హెచ్‌ఆర్, శిక్షణ. లాస్ట్ మైల్ డెలివరీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది. 40 శాతం కంటే ఎక్కువ సరుకులు కేవలం కిరాణా డెలివరీ కార్యక్రమం ద్వారానే డెలివరీ చేయనున్నారు. ఇది కాకుండా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో ఈ సంవత్సరం కంపెనీ 19 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఏర్పాటు చేసింది.