- Home
- Business
- 8th Pay Commission: కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 8వ పే కమిషన్‌కు అంతా రెడీ
8th Pay Commission: కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 8వ పే కమిషన్‌కు అంతా రెడీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త రాబోతోంది. ఎనిమిదో పే కమిషన్ రంగం సిద్ధమైంది. కోటిమంది ఉద్యోగులకు దీని వల్ల జీతాలు పెరగబోతున్నాయి. ఈ కమిషన్ కు సంబంధించి ఇప్పటికే ముందడుగు వేసింది.

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్
కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంతోషాన్ని కలిగించే వార్త ఇది. ఎనిమిదవ వేతన సంఘం విషయంలో కేంద్రం చురుగ్గా పనిచేస్తుంది. ప్యానెల్ ఏర్పాటు కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో సమావేశమై ఎన్నో అంశాలను చర్చించారు.
ఈ ఏడాది జనవరిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇంతవరకు దానిపై పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ముందడుగు వేసింది. ఉద్యోగుల సంఘాలు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాయి. దీంతో ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు విషయంలో త్వరితగతిన చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలోనే వేతన సంఘం
తాజాగా 8 వ వేతన సంఘం ఏర్పాటు లో భాగంగా అతి త్వరలోనే వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. అంతేకాదు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని కూడా మాట ఇచ్చారు. దీంతో కోటి 20 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆశలు చిగురించాయి.
ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాయని, అతి త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘం రాజ్యాంగాన్ని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులు అడిగిన చాలా అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఏడో వేతన సంఘం చివరి భత్యం
కాగా ఏడాది ఏడవ వేతన సంఘం ముగియబోతోంది. చివరి వేతన సంఘం ఇచ్చిన కరువు భత్యం మూడు శాతం. దీన్ని ప్రతి ఏడాది దీపావళి పండుగకు ముందే అందజేస్తారు. ఈ సవరణ తర్వాత ఉద్యోగుల డిఏ 55 శాతం నుండి 58 ఎనిమిది శాతానికి పెరిగింది. అక్టోబర్ నెల జీతం లో మూడు నెలల బకాయిలతో పాటు వీటిని అందించే అవకాశం ఉంది.
జీతాలు భారీగా పెరుగుతాయి
ఎనిమిదవ వేతన సంఘం వస్తే మరింతగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఎప్పటినుంచో ఎనిమిదవ పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఇది రాబోతోంది. జనవరి ఒకటి 2026 నుండి 8వ వేతన సంఘం తమ పనులను ప్రారంభిస్తుంది. ఈ లోపే ప్యానల్ ఏర్పాటు జరగాలి. ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది.
8వ వేతన సంఘంతో ఎంత జీతం పెరుగుతుంది?
ప్రభుత్వం జనవరి 2025లో 8వ కమిషన్ ప్రకటించినప్పటికీ, ఛైర్మన్, కమిటీ సభ్యులను ఇంకా నియమించలేదు. కొత్త వేతన నిబంధనలు కూడా సిద్ధం కాలేదు. సాధారణంగా, సిఫార్సులు అమలు కావడానికి 18 నుండి 24 నెలలు పడుతుంది. కాబట్టి, కొత్త వేతన విధానం 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం, 8వ కమిషన్‌లో జీతం పెంపు 30-34% వరకు ఉండవచ్చు.