Gold Rate: బంగారం ఏకంగా 10 వేలు తగ్గింది..ఇది నమ్మలేని నిజం...శ్రావణ మాసంలో పండగే..
శ్రావణమాసంలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రావణమాసంలో బంగారం ధర భారీగా పడిపోయింది. బహుశా చరిత్రలో ఈ స్థాయిలో బంగారం ధర ఎప్పుడు పడిపోలేదేమో, అందుకే అతి తక్కువ ధరకే మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తుంటే మాత్రం, ప్రస్తుతం ధర ఎంత ఉందో మీరు తెలుసుకోవడం ద్వారా నగల షాపింగ్ కు వెళ్లే ముందు మీకు ఒక అవగాహన వస్తుంది.
బంగారం ధరల విషయానికొచ్చినట్లయితే, దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58671 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం ఒక ఔన్సు 31 గ్రాముల ధర 1911 డాలర్లు పలుకుతోంది. మే నెలలో బంగారం ధర 2050 డాలర్ల రూపాయలు పలికింది. అక్కడి నుంచి గడిచిన మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 1880 డాలర్లకు పడిపోయింది.
ప్రస్తుతం బంగారం ధర 1910 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే గడచిన వారం రోజుల్లో బంగారం ధర 30 డాలర్లు పెరిగింది. అయినప్పటికీ గరిష్ట స్థాయి నుంచి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 130 డాలర్లు తగ్గింది. రూపాయలలో చూసినట్లయితే దాదాపు పదివేల వరకు బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు.
అయితే దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మే నెలలో 62000 పలికింది అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం బంగారం ధర 58 వేల నుంచి 59 వేల మధ్యలో ట్రేడ్ అవుతోంది. ఇక్కడ నుంచి బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రాబోయే ఫెస్టివల్ సీజన్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బంగారం ధరలు ఈ స్థాయిలో మరింత కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయి కన్నా తక్కువగా ఉండటంతో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు శ్రావణమాసంలో మీరు బంగారం కొనుగోలు చేసుకోవాలని భావిస్తున్నట్లయితే, తప్పనిసరిగా హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారం కొనుగోలు చేస్తే మంచిది. . కేంద్ర ప్రభుత్వం కూడా హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కచ్చితంగా విక్రయించాలని చెబుతోంది ఈ నేపథ్యంలో ఎవరైనా హాల్ మార్క్ లేని బంగారం నగలు విక్రయిస్తున్నట్లయితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తూనికలు కొలతల శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు బంగారం ధరలు భవిష్యత్తులో ఎంత మేర తగ్గుతాయి అని ఆరా తీస్తున్నారు అలాంటి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే అమెరికాలోని బాండ్ మార్కెట్లో అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయం పెరుగుతోంది. దీంతో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. అమెరికా ట్రెజరీ బాండ్లపైనే పెట్టుబడులు మళ్ళిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గివచ్చే అవకాశం కనిపిస్తోంది.