Gold Rate: శ్రావణ మాసంలో పండగే..బంగారం ధర ఏకంగా రూ. 13000 పడిపోయింది..బంగారం రూ. 50 వేలకు పడిపోయ చాన్స్..
శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గిపోవడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు కూడా కారణం అవుతున్నాయని పసిడి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బంగారం మార్కెట్లో ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికాలో పసిడి ధరలు తగ్గడం అనే నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.
అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు అంటే 31 గ్రాముల బంగారం ధర 1888 డాలర్లుగా ఉంది. గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే ఈ ధర 1920 డాలర్ల నుంచి 1888 డాలర్లకు తగ్గింది. అంటే సుమారు 28 డాలర్లు తగ్గిపోయింది. ఇక ఇదే సంవత్సరం మే 4వ తేదీన బంగారం ధర 2050 డాలర్లు పలికింది. ఈ లెక్కన గరిష్ట స్థాయి నుంచి చూసినట్లయితే బంగారం ధర గడచిన మూడు నెలల్లో ఏకంగా 162 డాలర్లు పడిపోయింది. మన భారతీయ మారకంలో చూసినట్లయితే 13,471 రూపాయలు తగ్గింది.
ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగుముఖం పట్టడానికి ప్రధానంగా కారణాలు చూసినట్లయితే, అమెరికా బాండ్ మార్కెట్లో విడుదల చేసినటువంటి ట్రెజరీ బాండ్ల విలువ పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం బదులుగా అమెరికా ట్రెజరీ బాండ్లలోనే పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే బంగారం ధరలు 1800 డాిలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని, నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక దేశీయంగా చూసినట్లయితే, బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాదులో 59,020 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,100 రూపాయలుగా ఉంది. బంగారం ధర ఈ సంవత్సరం మే నెలలో గరిష్టంగా 62,400 రూపాయలుగా పలికింది. గరిష్ట స్థాయి నుంచి పోల్చినట్లయితే బంగారం ధర ఏకంగా 3400 రూపాయలు తగ్గింది.
మరోవైపు శ్రావణమాసంలో ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మాసంలో శుభకార్యాలు చాలా ఉంటాయి ముఖ్యంగా మహిళలు శుభకార్యాల కోసం బంగారు నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు. మీరు కూడా కొనుగోలు చేయాలని అనుకుంటే తగ్గుతున్న ఈ బంగారు ధరల మీద అవగాహన పెంచుకుంటే మంచిది. . బంగారు ధరలు తగ్గే కొద్దీ నగల దుకాణాలలో డిమాండ్ పెరుగుతుంది అన్న సంగతి గుర్తించాలి.
అయితే బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే నిగ్రహించాలని నగల దుకాణాలకు సూచించింది. ఈ నేపథ్యంలో మీరు ఖచ్చితంగా హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదు. బంగారం నాణ్యతను గుర్తించేందుకు వివిధ పరికరాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ బంగారము 22 క్యారెట్లు ఉందా లేదా 18 క్యారెట్లు ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.