MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్..ట్రంప్ నిర్ణయం కారణమా?

Today Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్..ట్రంప్ నిర్ణయం కారణమా?

Today Gold Rate: పసిడి ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. కొన్నిరోజుల క్రితం యుద్ధ ఉద్రిక్తతలతో పడిపోయిన ధరలు… ఇప్పుడు మళ్లీ రాకెట్‌లా ఎగబాకుతున్నాయి. దీనికి కారణం ట్రంప్ నిర్ణయమే అని అంటున్నారు. 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 01 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు మళ్లీ చుక్కలు
Image Credit : Getty

పసిడి ప్రియులకు మళ్లీ చుక్కలు

పసిడి ప్రియులకు మళ్లీ చుక్కలు కనిపిస్తున్నాయి. మళ్లీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెమ్మదిగా పెరుగుతోంది. రోజుకు తక్కువలో తక్కువ సగటున రూ.1000 పెరుగుతోంది. కొన్నిరోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పసిడి రేట్లు పాతాళానికి పడిపోయాయి. కానీ ఆ తర్వాత శాంతి చర్చలకు పిలుపునివ్వడంతో మళ్లీ పెరిగింది. మళ్లీ కొన్ని రోజులకు అమెరికా యుద్ధానికి సిద్ధమవ్వడంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యింది. ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతున్నారు. మొన్నటివరకు డాలర్ బలపడటంతో అటువైపు అడుగులు వేశారు. ఇప్పుడు సేఫ్ ఆప్షన్‍గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్థిరంగా వెండి
Image Credit : Getty

స్థిరంగా వెండి

అటు వెండి స్థిరంగా ఉంటున్నప్పటికీ ఒక్కోసారి సడెన్‍గా బాంబ్ పేల్చుతోంది. అయితే అమాంతం తగ్గిపోవడం లేదంటే...ఒక్కసారిగా పెరిగిపోవడం.దీంతో కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు. 

34
రూ.1,51,480కు చేరిన మేలిమి పసిడి
Image Credit : Getty

రూ.1,51,480కు చేరిన మేలిమి పసిడి

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‍లో ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కు చేరింది అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1800 ఎగబాకి రూ.1,38,850 పలుకుతోంది. విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తా నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. 

44
ట్రంప్ నిర్ణయమే కారణమంటున్న నిపుణులు
Image Credit : Getty

ట్రంప్ నిర్ణయమే కారణమంటున్న నిపుణులు

ధరలు పెరగడానికి ట్రంప్ నిర్ణయమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రెండు మూడు వారాల్లో యుద్ధం ఆపేస్తామని ట్రంప్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‍తో కలిసి ఇరాన్‍పై దాడుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఓ వైపు ట్రంప్ ప్రకటన ఇలా ఉన్నా..ఇంకా యుద్ధం సద్దుమణగలేదు. దీంతో ఇప్పటికే ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. విమాన ఇంధనం ఎన్నడూ లేనంతగా ఈసారి రెట్టింపు పెరిగింది. కిలో లీటరుకు సుమారు రూ.2,12,450 రూపాయలకు చేరుకుంది. ఇంతకు ముందు రూ. 96,638 గా ఉండేది. ఇప్పుడు రెట్టింపైంది. దీంతో ఇక విమాన టికెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. అటు పెట్రోల్ ధరలు, గ్యాస్ రేట్లు పెరగడంతో...సామాన్యుల జేబులకు చిల్లులు తప్పేలా లేదు. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు ద్రవ్యోల్బణం దెబ్బకు...ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Gold Buying Tips: బంగారం కొంటున్నారా? బీ కేర్ ఫుల్.. ఇవి తెలియకపోతే నష్టమే!
Recommended image2
Today Gold Price: పసిడి ప్రియులకు బిగ్ షాక్..అక్షయ తృతీయ, ఇరాన్ వార్ ఎఫెక్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved