Gold Rate today: బంగారం ధరలు తగ్గుతున్నాయి, ఈరోజు వెండి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate today: బంగారం ధరలు భారీగా తగ్గడం కనిపిస్తోంది. రోజురోజుకీ బంగారం ధరల్లో తగ్గుదల ఉంది. తాజాగా నవంబర్ 9వ తేదీన 2025న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

బంగారు ధరలు
బంగారం ధరలు గత కొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు మెల్లగా ధరలు కిందకు దిగడం ప్రారంభించాయి. రోజురోజుకీ ఎంతోకొంత బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా చూసుకుంటే బంగారం ధరల్లో తగ్గుదల స్థిరంగా ఉంది. నవంబర్ 9, 2025 ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
బంగారం, వెండి ధరలు
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,24,320 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,250 రూపాయలు వస్తాయి. ఇక కిలో వెండి ధర 1,52,050 రూపాయలుగా ఉంది. ఇంకా బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
డాలర్ విలువ పెరగడం వల్ల
మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధర తగ్గుతోందని కూడా భావిస్తున్నారు. గత పది రోజుల్లో బాగా డాలర్ ధర విపరీతంగా పెరగడం వల్ల చూసాము. అయితే డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు బంగారం ధరలతో కనిపిస్తుంది.
స్టాక్ మార్కెట్లో లాభాలు
అమెరికాలో జరిగిన మార్పులు కూడా బంగారం ధర తగ్గడానికి కారణాలుగా ఉంటాయి. అమెరికా స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే లాభాల బాటన పడుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతూ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసివేసి స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటారు. దీని వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతాయి. నిజానికి గత ఏడాదిగా పోల్చుకుంటే బంగారం ధరలు విప్పరీతంగా పెరిగిపోయాయి. దాదాపు 50 శాతం పెరిగాయని చెప్పాలి. ఆ 50 శాతం బంగారం ధరలు ఇప్పుడు తగ్గడం చాలా కష్టం. కానీ కొంతమేరకు పసిడి ధరలు తగ్గే అవకాశం ఉంది.