MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Business
  • Gold Prices Fall: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.20వేలు పతనమైన గోల్డ్, సిల్వర్

Gold Prices Fall: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.20వేలు పతనమైన గోల్డ్, సిల్వర్

Gold Prices Fall: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం దాదాపు రూ.20వేలు పతనమైంది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలకు చేరి ఆందోళనకు గురిచేసిన గోల్డ్ రేట్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మరి ఈరోజు బంగారం ఎంత తగ్గిందో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 25 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్
Image Credit : Getty

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం దాదాపు రూ.20వేలకుపైగా దిగొచ్చింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలకు చేరి ఆందోళనకు గురిచేసిన గోల్డ్ రేట్లు…క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు కూడా ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.  


మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన పరిణామాలు, డాలర్, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు వంటి కారణాలతో బంగారం ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గాయి. దీంతో నగలు కొనాలనుకునేవారు, పెట్టుబడి కోసం గోల్డ్‌లో డబ్బు పెట్టాలనుకునేవారు ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుప్పకూలిపోతున్న పసిడి
Image Credit : stockPhoto

కుప్పకూలిపోతున్న పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,40,130గా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.2,780 తగ్గింది. ఒక్కరోజులోనే దాదాపు మూడు వేల రూపాయల వరకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా క్షీణించింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,28,450గా ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.2,550 తగ్గింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,05,100గా ఉండగా, రూ.2,080 తగ్గుదల నమోదైంది. బంగారం మాత్రమే కాదు... వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,30,000 వద్ద కొనసాగుతుండగా, నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 తగ్గింది. 

34
బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి?
Image Credit : our own

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి?

దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న మార్పులు. సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగితే పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీస్తారు. కానీ ప్రస్తుతం కొంతమంది పెట్టుబడిదారులు తమ డబ్బును ఇతర ఆస్తుల్లో పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గోల్డ్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం కొనుగోలు ఖర్చు ఇతర దేశాలకు ఎక్కువ అవుతుంది. దాంతో డిమాండ్ కొంత తగ్గి ధరలు కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. 

44
రెండ్రోజుల్లో వెండి పతనం
Image Credit : ChatGPT

రెండ్రోజుల్లో వెండి పతనం

ఇక వెండి మార్కెట్ పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో ట్రేడ్ అయిన వెండి ధర ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ఒక్కరోజులోనే కిలో వెండిపై భారీ తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వెండి ధరలు తగ్గడానికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పరిశ్రమల డిమాండ్, పెట్టుబడిదారుల కొనుగోలు విధానాలు, ప్రపంచ ఆర్థిక అంచనాలు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
Recommended image2
Gold Price Today: బంగారం ఇంత తగ్గిందేంటి?..ఇక పతనం తప్పదా? పసిడి బాటలోనే సిల్వర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved