దీపావళి తర్వాత భారీగా తగ్గిన బంగారం ధర
దీపావళి తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఒక తులం బంగారం రూ.3,280 తగ్గింది. ప్రస్తుతం రూ.56,360కి అమ్ముడవుతోంది. అనుకోని విధంగా బంగారం ధరలు తగ్గడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే ప్రపంచం మొత్తం మీద బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా టాప్ 3 లో ఉంటుంది. ధరలతో సంబంధం లేకుండా అవకాశం కుదిరినప్పుడల్లా నగలు కొని దాచిపెట్టుకుంటారు. అందుకే బంగారు నగల దుకాణాల్లో రోజూ జనం కిటకిటలాడుతుంటారు. బంగారం ధరలు పెరిగినా ప్రజలు బంగారం కొనుగోలు చేస్తారు. బంగారం రేట్లు ఎప్పటికైనా పెరుగుతాయని, అవి తమ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు భావిస్తారు. అందుకే బంగారం కొనడాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తారు.
కొద్దికొద్దిగా బంగారం కొని పెట్టుకొంటే అత్యవసర అవసరాలకు బంగారం అమ్ముకుని డబ్బు అరేంజ్ చేయవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లకు బంగారంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా వచ్చేసింది. గోెల్డ్ రేట్స్ కి బట్టి షేర్స్ కొంటే అవి ధరలకు అనుగుణంగా పెరుగుతాయి. దీంతో కేవలం రూ.10 నుంచి కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
2010లో ఒక తులం బంగారం రూ.10,000 మాత్రమే ఉండేవి. ఇప్పుడు బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీపావళి రోజున అక్టోబర్ 31న ఒక తులం బంగారం రూ.59,640కి చేరుకుంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భావించారు.
దీంతో మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేక ఇబ్బంది పడ్డారు. కానీ అనుకోని విధంగా తర్వాత 10 రోజుల్లో బంగారం ధరలు వేగంగా తగ్గిపోయాయి. దీపావళి రోజున రూ.59,640 ఉన్న ఒక 8 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.56,360కి తగ్గింది. 10 రోజుల్లో ఏకంగా రూ.3280 తగ్గింది. దీన్ని బట్టి ధరలు ఎంత వేగంగా తగ్గుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ 2025 నాటికి బంగారం భారీగా పెరుగుతుందని నిపుణులు తెలిపారు. కాని మార్కెట్ లో మాత్రం అనుకోని సంఘటనలు అంచనాలను తారుమారు చేస్తున్నాయి. పెరుగుతాయనుకున్న ధరలు తగ్గుతుండటంతో మధ్య తరగతి, పేద ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ఒక గ్రాము బంగారం రూ.7085కి అమ్ముడైంది. నేడు రూ.7045 ధర పలుకుతోంది. ఒక తులం బంగారం ధర రూ.320 తగ్గింది. నిన్న రూ.56,680 ఉన్న ధర నేడు రూ.56,360కి తగ్గింది.