- Home
- Business
- Gold: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఎక్కువ ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తారో తెలుసా?
Gold: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఎక్కువ ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తారో తెలుసా?
Gold: మీకు తెలుసా? మన దేశంలో ఎవరు ఎంత బంగారం దాచుకోవచ్చన్న విషయంపై చట్టపరంగా పరిమితులు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం లిమిట్ కి మించి గోల్డ్ మీ దగ్గర ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బంగారం ఉంచుకోవడానికి ఇదే లిమిట్
మన దేశంలో బంగారం అంటే అదో వస్తువు మాత్రమే కాదు. ఆడవాళ్లకు ఆరోప్రాణం లాంటిది. మగవాళ్లకు వెలకట్టలేని ఆస్తి లాంటిది. దీని కోసం అక్రమాలకు పాల్పడతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం చట్టపరంగా బంగారంపై కొన్ని పరిమితులు పెట్టింది. అంటే అనధికారికంగా ఎంత బంగారం ఉండాలో కొన్ని రూల్స్ ఉన్నాయన్న మాట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ప్రకారం ఆదాయపు పన్ను సోదాల సమయంలో ఎంత బంగారం ఉంచుకోవచ్చన్న విషయంపై మార్గదర్శకాలు ఉన్నాయి. వివాహిత స్త్రీకి 500 గ్రాములు, అవివాహిత స్త్రీకి 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నా ఈ పరిమితులు వర్తిస్తాయి.
లిమిట్‌కి మించి బంగారం ఉంటే ఏం చేస్తారు
అయితే ఈ లిమిట్స్ కి మించి అనధికారికంగా బంగారం ఉంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీపై చర్యలు తీసుకుంటారు. అంటే అప్పటి పరిస్థితిని బట్టి ఫైన్ వేయడం, జప్తు చేయడం లాంటి చర్యలు తీసుకుంటారు.
ఒకవేళ మీ దగ్గర వారసత్వంగా, బహుమతిగా వచ్చిన బంగారం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. పన్ను రసీదులు, బ్యాంకు రికార్డులు, బహుమతి పత్రాలు, వారసత్వంగా వచ్చిన బంగారానికి సంబంధించిన వీలునామా వంటివి ఆధారాలుగా చూపించవచ్చు.
బంగారం అమ్మినా ట్యాక్స్ కట్టాలి
మన దేశంలో బంగారం అమ్మకంపై కూడా పన్ను ఉంటుంది. 24 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం క్రితం కొన్న బంగారాన్ని మీరు అమ్మితే వచ్చే లాభాలను స్వల్పకాలికంగా పరిగణించి వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.
24 నెలలకు మించి మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మితే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు(LTCG)గా పరిగణించి 12.5% పన్ను విధిస్తారు.
బంగారం ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చే LTCGపై రూ.1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది.
గిఫ్ట్ గా వచ్చిన బంగారానికి కూడా ట్యాక్స్ కట్టాలి
బహుమతిగా వచ్చే బంగారంపై కూడా పన్ను ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆర్థిక సంవత్సరంలో బహుమతిగా వచ్చిన బంగారం విలువ రూ.50,000 దాటితే దాన్ని "ఇతర వనరుల నుండి ఆదాయం" కింద పరిగణించి ఆదాయపు పన్ను శాఖాధికారులు ట్యాక్స్ విధిస్తారు. అయితే వివాహ సమయంలో, వీలునామా ద్వారా వచ్చే బంగారానికి ఈ పన్ను వర్తించదు. కాబట్టి బంగారానికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బంగారం కొనుగోలుపై పన్నులు
మీరు బంగారం కొంటే 3% GST కట్టాలి. తయారీ ఛార్జీలపై 5% పన్ను కట్టాలి. వ్యక్తులు బంగారం అమ్మినప్పుడు GST ఉండదు. అయితే చెల్లింపు రసీదులను భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఏవైనా ఎక్వైరీలు, సోదాలు జరిగితే ఈ ఆధారాలు మీకు ఉపయోగపడతాయి.