MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గోల్డ్ ఈటీఎఫ్ vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్: ఏ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది?

గోల్డ్ ఈటీఎఫ్ vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్: ఏ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది?

Gold ETF vs Gold Mutual Fund : ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. అయితే, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లలో ఏది పెట్టుబడికి మంచిది? దేనిలో ఎక్కువ లాభాలు ఉంటాయి? రాబడులు, పన్నులు, లిక్విడిటీ వివరాలు మీకోసం.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 18 2025, 11:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బంగారం పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి
Image Credit : AI Picture

బంగారం పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి

2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, డిమాండ్ మధ్య బంగారం ధరలు రోజు రోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ తో పాటు డిజిటల్ ఆప్షన్లకు కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, దీని కోసం రెండు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.. అవి గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్), గోల్డ్ మ్యూచువల్ ఫండ్ (Gold Mutual Fund). ఈ రెండూ బంగారం ధరను ట్రాక్ చేస్తాయి, కానీ వాటి నిర్మాణం, లాభాలు, పన్ను వ్యవస్థలు వేర్వేరుగా ఉంటాయి.

26
గోల్డ్ ఈటీఎఫ్‌లో రాబడి ఎక్కువ
Image Credit : Google

గోల్డ్ ఈటీఎఫ్‌లో రాబడి ఎక్కువ

గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. అంటే మార్కెట్ అవర్‌ల్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లు సాధారణంగా SIP (Systematic Investment Plan) రూపంలో సులభంగా పెట్టుబడి చేయడానికి అనువైనవి.

విశ్లేషకుల ప్రకారం, గత ఐదు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు మ్యూచువల్ ఫండ్‌లతో పోలిస్తే 0.5% నుండి 1% వరకు ఎక్కువ రాబడి ఇచ్చాయి. ఉదాహరణకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ (ICICI Prudential Gold ETF) గత ఐదు సంవత్సరాల్లో 28% రాబడి ఇచ్చింది, కాగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల సగటు రాబడి 27% శాతంగా ఉంది.

Related Articles

Related image1
దీపావళి ఆఫర్‌: ఫ్రీగా బంగారం ఇస్తున్న జియో !
Related image2
దీపావళి ఆఫర్లు: ఐఫోన్ 16 ప్రో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? బిగ్ డిస్కౌంట్
36
తక్కువ ఖర్చు రేటు, ఎక్కువ రాబడి
Image Credit : Google

తక్కువ ఖర్చు రేటు, ఎక్కువ రాబడి

గోల్డ్ ఈటీఎఫ్‌లో వార్షిక ఎక్స్‌పెన్స్ రేషియో 0.5% నుంచి 1% మధ్యలో ఉంటుంది. అదే సమయంలో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇది 0.6% నుంచి 1.2% వరకు ఉంటుంది. ఇది చిన్న తేడా అనిపించినా, దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ₹10 లక్షల పెట్టుబడిపై 7.5% వార్షిక రాబడి అని భావిస్తే, గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా ₹14.7 లక్షలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ₹14.4 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చు అంటే పెట్టుబడిదారుడికి నేరుగా ఎక్కువ లాభం అని అర్థం.

46
లిక్విడిటీ ఎక్కువ, మార్కెట్ రిస్క్ తక్కువ
Image Credit : ISTOCK

లిక్విడిటీ ఎక్కువ, మార్కెట్ రిస్క్ తక్కువ

గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా తక్షణ కొనుగోలు/అమ్మకం సౌకర్యం ఇస్తాయి. కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో రిడంప్షన్ ప్రక్రియలో ఒకటి లేదా రెండు రోజులు పడుతుంది. 2025లో బంగారం ధరల్లో ఎదురయ్యే తక్షణ మార్పులను గమనిస్తే, గోల్డ్ ఈటీఎఫ్‌లు తక్షణ లాభం పొందడంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి.

అదనంగా, ఈటీఎఫ్‌లలో బ్రోకరేజ్ ఛార్జీలు తక్కువగా ఉండడం, అధిక లిక్విడిటీ కలిగించడంతో ఆకర్షణీయంగా మారింది.

56
పన్ను ప్రయోజనాలు, పారదర్శకత
Image Credit : meta ai

పన్ను ప్రయోజనాలు, పారదర్శకత

గోల్డ్ ఈటీఎఫ్‌లను పన్ను పరంగా మ్యూచువల్ ఫండ్‌లలా ట్రీట్ చేస్తారు, కానీ వీటిలో క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్ తక్కువగా ఉంటుంది. 2023-2025 మధ్యకాలంలో షార్ట్ టర్మ్ గెయిన్‌లు స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. అయితే మూడు సంవత్సరాల తర్వాత లాంగ్ టర్మ్ గెయిన్‌లపై 20% పన్ను ఇండెక్సేషన్‌తో ఉంటుంది.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అదనపు మేనేజ్‌మెంట్ ఫీజు కారణంగా పన్ను భారమూ పెరిగే అవకాశం ఉంది. అదనంగా, గోల్డ్ ఈటీఎఫ్‌లు 99.5% శుద్ధ బంగారం ధరను పారదర్శకంగా ట్రాక్ చేస్తాయి. ఇక్కడ ఫండ్ మేనేజర్ జోక్యం ఉండదు, ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుంది.

66
గోల్డ్ ఈటీఎఫ్ vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెస్ట్?
Image Credit : Getty

గోల్డ్ ఈటీఎఫ్ vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెస్ట్?

మొత్తంగా, గత ఐదు సంవత్సరాల డేటా ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు రాబడుల్లో ముందంజలో ఉన్నాయి. తక్కువ ఖర్చు, ఎక్కువ లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు, పారదర్శక వ్యవస్థ వంటి అంశాలు గోల్డ్ ఈటీఎఫ్‌లను దీర్ఘకాలిక పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి. 2025లో బంగారం ధరలు స్థిరంగా పెరుగుతాయని అంచనా వేస్తున్న ఈ పరిస్థితుల్లో, నిపుణులు డిజిటల్ గోల్డ్ రూపంలో ఈటీఎఫ్‌లను పరిశీలించడం పెట్టుబడిదారులకు లాభదాయకం అని సూచిస్తున్నారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మనీ సంబంధం కలిగిన అంశాల్లో మరింత మంది నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బంగారం
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved