వీకెండ్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి కొంటున్నారా.. దిగొస్తున్న ధరలు.. తులం ఎంతంటే..?
బంగారం ధరలు గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ (10 గ్రాములు) తగ్గాయి. సెప్టెంబర్ 9 శనివారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,170 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.54,200. ఒక కిలో వెండి దేశవ్యాప్త ధర రూ.74,000గా నమోదు చేయడంతో వెండి ధర స్థిరత్వాన్ని కొనసాగించింది.
ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో నేడు మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,000 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,000.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,000గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు)కి రూ. 58,070 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 55,300.
విజయవాడలో రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840.
విజయవాడలో వెండి విషయానికొస్తే ధర కిలోకు రూ. 77,500.
విశాఖపట్నంలో బంగారం ధరలు చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 54,850, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840.
విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 77,500.
హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,840. మొత్తంగా రూ.150 నుండి రూ.160 తగ్గాయి.
వెండి ధరలు చూస్తే ఇక్కడ కేజీ ధర రూ. 1000 పడిపోయి రూ.77,500 మార్కుకు చేరింది
ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ధరలు ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనేముందు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.