పసిడి ప్రియులకు అదిరేపోయే న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ.1000 డౌన్..
శ్రావణమాసంలో మహిళలకు, బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. గత కొద్దిరోజులుగా వెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో బంగారం ధరలు 24 క్యారెట్లు/ 22 క్యారెట్లు (10 గ్రాములు) స్థిరంగా ఉన్నాయి. ఈరోజు 6 సెప్టెంబర్ 2023న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,390, అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,370.
నేడు ముఖ్యమైన నగరాలలో 24 క్యారెట్/ 22 క్యారెట్ ధరలలో మార్పులు నమోదు చేయబడ్డాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,470, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,450
ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300
చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.58,220, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,450
కోల్‌కతాలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు
US ట్రెజరీ ఈల్డ్‌లు అండ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలతో డాలర్ బలపడటంతో బంగారం ధరలు బుధవారం వారంలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయని ఓ వార్తా సంస్థ నివేదించింది.
తాజా నివేదిక ప్రకారం మంగళవారం ఆగస్టు 1 నుండి అతిపెద్ద వన్డే నష్టాన్ని నమోదు చేసిన తర్వాత 0313 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,925.70 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,951 డాలర్లకి చేరుకుంది.
SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ దాని హోల్డింగ్స్ మంగళవారం 0.1 శాతం పడిపోయాయి. ఇతర విలువైన లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్సుకు $23.53 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300
విశాఖపట్నంలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర .60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300
ఒడిశాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,150.
హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.60,320, 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.55,300.
వెండి ధరలు
ఢిల్లీలో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 75,200 వద్ద ఉంది. ఈ రోజు ఒక కిలో వెండి ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 1000 పడిపోయింది. దింతో కిలో వెండి ధర రూ. 79,000 వద్ద ట్రేడవుతోంది.
ఇండియాలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి మారకం విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వీటి ధరలలో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.