Mini Cooler: వెయ్యి రూపాయలకే సూపర్ కూలర్.. హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా
సమ్మర్ వచ్చేస్తోంది. దీంతో పాత అటకపై పెట్టిన కూలర్లను కిందికి దించే సమయం వచ్చేసింది. మరి ఈ హాట్ సమ్మర్‌ను కూల్ మార్చేందుకే అమెజాన్‌లో మినీ కూలర్ ఉంది. ఇంతకీ ఏంటా కూలర్.? ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి ఇవరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Mini cooler
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో మిన్ కూలర్ అందుబాటులో ఉంది. ఈ మినీ కూలర్ అసలు ధర రూ. 3899కాగా అమెజాన్‌లో 74 శాతం డిస్కౌంట్‌తో రూ. 998కి లభిస్తోంది. ఇంత చిన్న కూలర్‌లో వాటర్ స్టోర్ చేసే సదుపాయం కూడా అందించారు. స్ప్రే ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే ఫ్యాన్ గాలితో పాటు నీటి తుంపర్లతో వాతావరణాన్ని కూల్‌గా మార్చేస్తుంది.
Mini cooler
ఈ కూలర్‌లో 3 స్పీడ్ విండ్ సిస్టమ్‌ను అందించారు. అలాగే 5 స్ప్రేలను అందించారు. ఇక ఫ్యాన్‌ను 60 డిగ్రీల మేర అడ్జెస్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఈ కూలర్‌లో 7 రకాల లైట్స్ మోడ్‌ను అందించారు. రాత్రుళ్లు ఇది బెడ్ లైట్‌లాగా కూడా ఉపయోగపడుతుంది. సుమారు ఒక ట్యాబ్ కంటే కాస్త ఎక్కువ పరిమాణంలో ఉంటుందీ కూలర్. ఇక పవర్ సప్లై కోసం ఈ కూలర్‌కు యూఎస్‌బీ కేబుల్‌ను అందించారు. దీంతో మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్లు కరెంట్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీ ల్యాప్‌టాప్, పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్‌తో కూడా ఆన్ చేయొచ్చు. అంటే ప్రయాణాల్లో కూడా ఈ మినీ కూలర్‌ను తీసుకెళ్లొచ్చు.
Mini cooler
తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకోవడం ఈ కూలర్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ కూలర్ బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం. అంటే అద్దకిలో కంటే తక్కువన్నమాట. చిన్న గదులకు, ఒక వ్యక్తికి ఈ కూలర్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అదే విధంగా చదువుకునే విద్యార్థులకు, డెస్క్‌టాప్‌లపై వర్క్ చేసే వారికి కూడా ఈ కూలర్ బాగా పనిచేస్తుంది. గమనిక: ఈ వివరాలను అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో ఉన్న రివ్యూల ఆధారంగా కొనుగోలు చేయడం ఉత్తమం.