- Home
- Business
- Gemini Live AI: AIలో కళ్లు చెదిరిపోయే ఫీచర్, ఇకపై లైవ్ వీడియోలు చూపించి AIని ప్రశ్నలు అడగచ్చు
Gemini Live AI: AIలో కళ్లు చెదిరిపోయే ఫీచర్, ఇకపై లైవ్ వీడియోలు చూపించి AIని ప్రశ్నలు అడగచ్చు
Gemini Live AI: AI టెక్నాలజీలో కొత్త విప్లవం స్టార్ట్ అయ్యింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్.. ఇప్పటి వరకు వాయిస్, మెసేజ్ ల రూపంలో సమాచారం అందించింది కదా.. ఇకపై మనం లైవ్ వీడియోలు చూపించి AIని ప్రశ్నలు అడగచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ స్క్రీన్ ను షేర్ చేసి కూడా మీకు కావాల్సిన సమాచారం పొందొచ్చు. అద్భుతమైన ఈ అనుభవాన్ని మీరు పొందాలంటే గూగుల్ సంస్థ జెమిని లైవ్ ను మీరు ఉపయోగించాల్సిందే. జెమిని లైవ్ ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

AI కళ్లతో ప్రపంచాన్ని చూసే కొత్త అనుభవాన్ని గూగుల్ సంస్థ అందిస్తోంది. జెమిని లైవ్ ద్వారా లైవ్ వీడియో, స్క్రీన్ షేరింగ్ ఫీచర్లను పరిచయం చేస్తోంది. మీ స్క్రీన్‌ను AI యాక్సిస్ చేయడానికి మీరు పర్మీషన్ ఇస్తే దాని ద్వారా మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా సెకన్లలో మీ కళ్ల ముందు ఉంచుతుంది.
AI మొదటిసారి ఈ ప్రపంచాన్ని చూస్తోంది
సాధారణ మనుషులు చూసినట్టుగా ఇకపై AI కూడా ఈ ప్రపంచాన్ని చూడగలదు. జెమిని లైవ్ ద్వారా మీ కెమెరా నుండి AIకి లైవ్ వీడియోను చూపించి ప్రశ్నలు అడగవచ్చు. AI ఆ వీడియోను విశ్లేషించి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇది ఒక మాయా అద్దంలా ఉంటుందన్న మాట.
జెమిని లైవ్ వీడియో అంటే..
ఉదాహరణకు మీరు ఓ షాపింగ్ మాల్ కి వెళ్లాలనుకుందాం. అక్కడ మీకు రెండు డ్రెస్సులు నచ్చాయి. ఆ రెండింటినీ జెమిని లైవ్ ఫీచర్ ఉపయోగించి లైవ్ వీడియోలో AIకి చూపించండి. మీ స్కిన్ కలర్ చెప్పి ఈ రెండింటిలో ఏది మీకు సూటవుతుందని అడగండి. మీ అభిరుచికి తగినటు వంటి డ్రెస్ ని AI సెలెక్ట్ చేసి మీకు చెబుతుంది.
స్క్రీన్ షేరింగ్ చేస్తే ఏమవుతుంది
మీ మొబైల్ స్క్రీన్‌ను AI యాక్సెస్ చేసే పర్మీషన్ మీరిస్తే అది మీకు ఒక అసిస్టెంట్ లా పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు ‘డౌన్ లోడ్స్ లో సేవ్ చేసి పెట్టుకున్న రెజ్యూమ్ ని ఓపెన్ చెయ్’ అని AI కి చెప్పగానే డైరెక్ట్ గా ఓపెన్ చేస్తుంది. మీరు ఏ అప్లికేషన్‌కు వెళ్లినా, ఏ పేజీ తెరిచినా, AI మీకు సమాచారం ఇస్తుంది. ఏ పని చేయాలన్నా వ్యక్తిగత సలహాలు కూడా ఇస్తుంది.
కొత్త ఫీచర్ల ప్రత్యేకతలు
లైవ్ వీడియో కాల్: AIతో వీడియో కాల్‌లో మాట్లాడొచ్చు. మీ పరిసరాలను AIకి చూపి, మీకు కావాల్సిన సమాచారం పొందవచ్చు.
స్క్రీన్ షేరింగ్: మీ మొబైల్ స్క్రీన్‌ను AIకి చూపించి దాని ద్వారా సహాయం పొందవచ్చు.
రియల్ టైమ్ విశ్లేషణ: AI వెంటనే వీడియో, స్క్రీన్ సమాచారాన్ని విశ్లేషించి, మీకు సమాధానం ఇస్తుంది.
వ్యక్తిగత గైడ్: AI మీ ప్రతి పనిని గమనించి, మీకు కావలసిన సమాచారం ఇస్తుంది.
సులువైన వినియోగం: జెమిని లైవ్ ఇంటర్‌ఫేస్ వాడటానికి సులువుగా ఉంటుంది.
ఉపయోగాలు - అంతులేని అవకాశాలు:
విద్య: AI సహాయంతో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
ప్రయాణం: కొత్త ప్రదేశాలను AI సహాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.
షాపింగ్: AI సహాయంతో మంచి వస్తువులను ఎంచుకోవచ్చు.
సాంకేతిక సహాయం: AI సహాయంతో మొబైల్ సమస్యలను పరిష్కరించవచ్చు.
వినోదం: AI సహాయంతో ఆటలు, వీడియోలను ఆస్వాదించవచ్చు.
శాస్త్రవేత్తల అభిప్రాయం
జెమిని లైవ్ ద్వారా AI ఒక సరైన సహాయకుడిగా పనిచేస్తుంది. తన అభిప్రాయాలను కచ్చితత్వంతో చెబుతుంది. ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అందువల్ల సరైన నిర్ణయం చెబుతుంది. ఇది మనుషులకి, AIకి మధ్య సంబంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుందని గూగుల్ పరిశోధకులు చెబుతున్నారు.
AI కళ్ళతో ప్రపంచాన్ని చూసే ఈ కొత్త టెక్నాలజీ, మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఇది సమాచార సాంకేతిక రంగంలో ఒక కొత్త శకాన్ని సృష్టిస్తుంది.