ఇవెక్కడి ఆఫర్లు సామీ.. ఫ్లిప్‌కార్ట్-ఎస్టీఐ కొత్త క్రెడిట్ కార్డు. పండగ చేస్కోండి
ఈ కామర్స్ సంస్థలు బ్యాంకులు కలిసి క్రెడిట్ కార్డులు తీసుకురావడం ఇటీవల ఎక్కువవుతోంది. ఇప్పటికే ఐసీఐసీ అమెజాన్‌తో కలిసి కార్డులు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్-ఎస్బీఐ కలిసి కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ – ఎస్బీఐ కార్డ్ కలసి కొత్త క్రెడిట్ కార్డు
ఫ్లిప్‌కార్ట్, ఎస్బీఐ కార్డ్ కలిసి ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్’ అనే ప్రత్యేకమైన కో-బ్రాండెడ్ కార్డ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ కార్డ్‌ను ఎస్బీఐ చైర్మన్ చల్ల శ్రీనివాసులు సెట్‌టి, ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ, ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి సమక్షంలో ప్రారంభించారు. ఈ క్రెడిట్ కార్డును ప్రధానంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు.
KNOW
జాయినింగ్ ఫీజు, వెల్కమ్ బెనిఫిట్స్
ఈ కార్డ్‌కు జాయినింగ్ ఫీజు, వార్షిక రీన్యువల్ ఫీజు రెండూ రూ.500 (పన్నులు అదనం). కార్డ్ తీసుకున్న వెంటనే రూ. 1,250 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఏటా రూ. 3.5 లక్షల ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఫ్యూయల్ సర్‌చార్జ్‌పై 1% మినహాయింపు కూడా ఉంటుంది.
షాపింగ్‌పై ప్రత్యేక క్యాష్‌బ్యాక్
* ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, క్లియర్‌ట్రిప్‌లో ఖర్చు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
* మింత్రా యాప్‌లో కొనుగోళ్లపై 7.5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
* జొమాటో, ఉబెర్, నెట్‌మెడ్స్, పీవీఆర్ వంటి కొన్ని బ్రాండ్లపై 4% క్యాష్‌బ్యాక్.
* మిగతా అన్ని ఖర్చులపై 1% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్. క్యాష్‌బ్యాక్ ఆటోమేటిక్‌గా రెండు రోజుల్లోనే కార్డ్ ఖాతాలో జమ అవుతుంది.
ఎక్కడ ఉపయోగించుకోవచ్చు?
ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డ్‌తో కస్టమర్లు విస్తృతమైన ఉత్పత్తులు, సర్వీసులపై డిస్కౌంట్లు పొందవచ్చు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, ఫర్నిచర్, కిరాణా సరుకులు, ట్రావెల్ బుకింగ్స్ వంటి విభాగాల్లో వాడుకోవచ్చు. కార్డ్‌ను డిజిటల్‌గా ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్‌కార్డ్, వీసా రెండింట్లోనూ ఇది అందుబాటులో ఉంది.
లాంచింగ్ ఆఫర్
ప్రత్యేక ఆఫర్‌గా, కార్డ్ అప్లై చేసిన కస్టమర్లకు ప్రతి రోజూ.. 10 సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు, 100 అంబ్రేన్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌లు, లలాటరీ ద్వారా గెలుచుకునే అవకాశం ఉంది.