Flipkart Sale: రూ.85 వేల టీవీ రూ.37 వేలకే! ఫ్లిప్ కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్
Flipkart Sale: మీ ఇంట్లో థియేటర్ స్కీన్ లాంటి టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారా? డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ ఆశను నిజం చేయడానికి ఫ్లిప్ కార్ట్ ముందుకొచ్చింది. రూ.85 వేలు ధర ఉన్న 65 ఇంచ్ టీవీని ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా మీరు కేవలం రూ.37 వేలకే కొనుక్కోవచ్చు. దుమ్మురేపే ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి వస్తువుపై మాక్సిమం 80 నుంచి 90 శాతం వరకు కూడా డిస్కౌంట్ ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, డ్రెసెస్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఆర్టికల్స్ ఇలా ప్రతి వస్తువుపై భారీ స్థాయిలో డిస్కౌంట్స్ ఇస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు వారికి అవసరమైన అన్ని వస్తువులను ధరలను తగ్గించింది.
పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్ వల్ల వాయిదా వేస్తుంటారు. అలాంటి వారు ఫ్లిప్‌కార్ట్ ఇచ్చే అదిరిపోయే ఆఫర్ ను ఉపయోగించుకొని మీ టీవీ కలను నెరవేర్చుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు 65 ఇంచ్ థామ్సన్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీకి 50% డిస్కౌంట్ తో ఇస్తోంది. అంటే రూ.85,000 విలువైన ఈ టీవీని జస్ట్ రూ.37,000కే కొనొచ్చు.
అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి
థామ్సన్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై డైరెక్ట్ డిస్కౌంట్ 50 శాతం ఇస్తున్నారు. అంటే టీవీ ధరలో సగం తగ్గిస్తున్నారు. ఇక మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1250 డిస్కౌంట్ లభిస్తుంది. మీ దగ్గర ఉన్న పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా రూ.85 వేల ధర ఉన్న టీవీ అన్ని డిస్కౌంట్లు పోను రూ.37 వేలకు లభిస్తుంది.
ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్
65 ఇంచ్ క్యూఎల్‌ఈడీ 4K స్క్రీన్ మీకు క్లియర్ అండ్ వైబ్రెంట్ విజువల్స్‌ని ఇస్తుంది. ఈ టీవీలో ఉన్న డాల్బీ అట్మాస్ సౌండ్ మీకు థియేటర్‌లో ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, యూట్యూబ్ యాప్స్‌ని డైరెక్ట్‌గా ఈ టీవీలో చూడొచ్చు.
టెక్నికల్ డీటెయిల్స్
ఈ టీవీలో ఉన్న మీడియాటెక్ MT9602 ప్రాసెసర్ ఫాస్ట్ అండ్ స్మూత్ పెర్ఫార్మెన్స్‌ని ఇస్తుంది. 2GB RAM, 16GB స్టోరేజ్ ఉండటం వల్ల యాప్స్‌ని ఫాస్ట్‌గా ఓపెన్ చేయడానికి, డేటాని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈథర్‌నెట్, HDMI, బ్లూటూత్ 5.0, ఆపిల్ ఎయిర్‌ప్లే ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ముఖ్య గమనిక: ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ప్రోడక్ట్ కొనే ముందు, మిగతా యూజర్ల రివ్యూస్ చదివి కొనడం మంచిది.