MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • eSIM లేదా సాాధారణ మొబైల్ సిమ్.. రెండింట్లో ఏది బెటర్?

eSIM లేదా సాాధారణ మొబైల్ సిమ్.. రెండింట్లో ఏది బెటర్?

eSIM అంటే ఎంతో మందికి తెలియదు. దానిపై సరైన అవగాహన మన ఇండియన్లకు చాలా తక్కువ.  భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు eSIM అంటే ఏమిటో ఇక్కడ వివరించాము.  సాధారణ సిమ్‌కి దీనికి తేడా ఏమిటో తెలుసుకోండి.

3 Min read
Author : Haritha Chappa
Published : Sep 01 2025, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
భవిష్యత్తు eSIM దే
Image Credit : google

భవిష్యత్తు eSIM దే

భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంది.   ఇప్పటికీ చాలామంది ఇప్పటికీ పాత ప్లాస్టిక్ సిమ్ కార్డులనే వినియోగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం eSIM టెక్నాలజనీ అభివృద్ధి చెందుతుంది.  ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు, పరికరాలు eSIM టెక్నాలజీని సపోర్ట్ చేసే విధంగానే వస్తాయి. సాధారణ సిమ్ వాడుతున్నవారు భవిష్యత్తులో eSIM నెట్‌వర్క్‌లను మారిపోవచ్చు. కానీ ముందుగా అదేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.  eSIM అంటే ఏమిటి, ఇది సాధారణ సిమ్ కార్డ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? అనే సందేహాలకు ఇక్కడ సమాధానం ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
eSIM అంటే ఏమిటి?
Image Credit : our own

eSIM అంటే ఏమిటి?

eSIM అంటే ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌బిల్ట్ చేసిన డిజిటల్ సిమ్ కార్డ్. దీన్ని సాధారణ సిమ్ కార్డ్ లాగా ఫోన్లోకి ఇన్సర్ట్ చేయడం లేదా తీసివేయడం వంటివి చేయాల్సిన  అవసరం లేదు. దానికి బదులుగా, మీ మొబైల్ ఆపరేటర్ దీన్ని డిజిటల్‌గా యాక్టివేట్ చేస్తారు. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్, వీ.. వంటి పెద్ద టెలికాం కంపెనీలు ఇప్పటికే కొన్ని రకాల ఫోన్లలో eSIM సేవలను అందించడం మొదలుపెట్టాయి. బీఎస్ఎన్ఎల్ కూడ త్వరలో ఈ సేవలు మొదలుపెట్టబోతోంది. కానీ ఎంతోమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఈ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు. 

Related Articles

Related image1
మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతుంటే.. రూ.17000 లాభం.. ఎలా పొందాలో తెలుసా?
Related image2
ఒకే సిమ్ తో రెండు WhatsApp అకౌంట్లు: iOS యూజర్లకు పండగే!
37
సాధారణ సిమ్ కార్డ్ అంటే?
Image Credit : our own

సాధారణ సిమ్ కార్డ్ అంటే?

SIM  అంటే సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ప్రస్తుతం మనమందరం వాడుతున్నాం.  మొబైల్ ఫోన్‌లో ఇన్సర్ట్ చేసే చిన్న ప్లాస్టిక్ కార్డులాగా ఉంటుంది. ఇది మీ మొబైల్ నంబర్, నెట్‌వర్క్, కాంటాక్ట్‌ల వంటి సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో నానో-సిమ్‌లను ఉపయోగిస్తున్నాము. ఇవి సిమ్ కార్డుల కన్నా చిన్నగా ఉండే వెర్షన్.

47
eSIM vs నార్మల్ సిమ్
Image Credit : our own

eSIM vs నార్మల్ సిమ్

•  సాధారణ సిమ్ కార్డును మొబైల్ లో పెట్టి తిరిగి తీయవచ్చు.  కానీ, eSIM ఇన్‌బిల్ట్ చేసి ఉంటుంది. దాన్ని తొలగించడం కుదరదు. 

• eSIM వాడుతున్న వారు  QR కోడ్‌ని స్కాన్ చేసి మొబైల్ ఆపరేటర్‌ని మార్చుకోవచ్చు. కానీ, సాధారణ సిమ్ కార్డుకి మాత్రం ఇలా మొబైల్ ఆపరేటర్ మార్చుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. 

• eSIM టెక్నాలజీ ఎంతో ఆధునికమైనది. దీన్ని ఒకేసారి ఫిజికల్ సిమ్, డిజిటల్ సిమ్ రెండింటినీ ఉపయోగించడానికి సహాయపడుతుంది. మీరు ఒకే ఫోన్‌లో రెండు నంబర్లను ఉపయోగించవచ్చు.

57
eSIM ఎలా బెటర్?
Image Credit : our own

eSIM ఎలా బెటర్?

• eSIMను దొంగిలిచండం వంటివి జరగవు. ఇది చాలా సురక్షితమైనది.

• eSIM ఫోన్ లోపల స్థలాన్ని ఆక్రమించదు. ఆదా చేస్తుంది. దీని వల్ల, ఫోన్ మరింత సన్నగా భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీలను ఫోన్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ సిమ్ తో పోలిస్తే eSIM చాలా బావుంటుందనే చెప్పాలి.

67
eSIM ప్రయోజనాలు
Image Credit : our own

eSIM ప్రయోజనాలు

eSIM వాడడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.  

• దీనితో సులువుగా నెట్‌వర్క్ మార్పిడి చేసుకోవచ్చు.  జియో, ఎయిర్‌టెల్, వీ వంటి ఆపరేటర్ల మధ్య మీరు బయటికి వెళ్లకుండానే నెట్ వర్క్ మారిపోవచ్చు.

• సిమ్ కార్డ్ దెబ్బతింటుందనే భయం లేదు. ఎందుకంటే ఇది వస్తువు రూపంలో ఉండదు. 

• ప్రయాణాలు చేసేవారికి  ఇది చాలా ఉపయోగకరమైనది.  వేరే రాష్ట్రాలకు లేదా దేశాలకు వెళ్లినప్పుడు కొత్త సిమ్ కార్డ్ కొనకుండానే, అంతర్జాతీయ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 

• డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీ కూడా దీనితో చాలా సులభం. పని, వ్యక్తిగత నంబర్‌ల కోసం డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని సపోర్ట్ చేస్తుంది.

77
 eSIM తో నష్టాలు
Image Credit : Packageslife

eSIM తో నష్టాలు

• తక్కువ పరికర మద్దతు: మనదేశంలని అన్ని స్మార్ట్‌ఫోన్‌లు eSIMని సపోర్ట్ చేయలేవు. ఐఫోన్‌లు, గూగుల్ పిక్సెల్, కొన్ని శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్స్  మాత్రమే  eSIM పనిచేస్తుంది.

• క్లిష్టమైన యాక్టివేషన్: ఫిజికల్ సిమ్‌ని ఇన్సర్ట్ చేసి వాడటం ప్రారంభించినట్లు కాకుండా, eSIM యాక్టివేషన్‌కు QR కోడ్‌ని స్కాన్ చేయడం, చాలా దశలను పాటించాల్సి ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే వెంటనే యాక్టివేట్ అవ్వదు. 

• ఫోన్‌ల మధ్య మార్చడం కష్టం: ఫిజికల్ సిమ్‌ని ఫోన్ నుండి తీసివేసి, మరొక ఫోన్‌లో సులువుగా చేసుకోవచ్చు. eSIMని మాత్రం పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్లో సెటప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

• ఫోన్ పాడైతే : మీ ఫోన్ పాడైతే ఫిజికల్ సిమ్ లాగా eSIMని బయటికి తీయలేరు. మీ ఆపరేటర్ నుండి కొత్త యాక్టివేషన్ కోరాల్సి ఉంటుంది. ఇది అదనపు సమయం తీసుకుంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతుంటే.. రూ.17000 లాభం.. ఎలా పొందాలో తెలుసా?
Recommended image2
ఒకే సిమ్ తో రెండు WhatsApp అకౌంట్లు: iOS యూజర్లకు పండగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved